గుర్రంపై ఊరేగితే చంపేస్తాం : దళిత యువకుడికి బెదిరింపులు

మీరట్ : బారాత్‌లో భాగంగా గుర్రంపై ఊరేగితే చంపేస్తామని దళిత యువకుడిని బెదిరించిన ఘటన యూపీలోని సర్ధానా ప్రాంతంలో వెలుగుచూసింది. పెండ్లి వేడుకలో నిర్వహించే బారాత్‌లో గుర్రంపై ఊరేగితే హత్య చేస్తామని బెదిరించారని దళిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనికి భద్రత కల్పించారు. పోలీసులు భద్రత కల్పించడంతో యువకుడు కుటుంబసభ్యుల ఆనందోత్సాహాల మధ్య బారాత్ వేడుకలో పాల్గొన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అదే ప్రాంతంలో ఉండే అగ్రకులాల వారు దళిత యువకుడిని గుర్రంపై ఊరేగితే హత్య చేస్తామని బెదిరించారని యువకుడి తండ్రి మంగేరాం సర్ధానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తమకు పోలీసు భద్రత కల్పించాలని కోరారు. మంగేరాం ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు ప్రశ్నించగా తాము పెండ్లికొడుకు గుర్రంపై ఊరేగడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదని, ఇటీవలే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించడంతో తమ ఇంటిమీదుగా వెళ్లే సమయంలో లౌడ్ స్పీకర్ వాడవద్దని కోరామని చెప్పాడు. అయితే దళిత యువకుడి కుటుంబ సభ్యులు నిందితుడి వివరణను తోసిపుచ్చారు.గతంలోనూ ఈ ప్రాంతంలో కుల వివక్ష, అల్లర్లు మామూలేనని చెప్పారు. తమ పండుగలను అగ్రకులాల వారు పలుమార్లు అడ్డుకున్నారని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Baraat
- dalith
- uttar pradesh
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

