ముంబై, ఏప్రిల్ 8: కరోనా నుంచి కోలుకొన్న పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్రమంగా తగ్గుతున్నట్టు తాజాగా తెలిసింది. బాధితుల పునరుత్పత్తి అవయవాల్లోకి వైరస్ ప్రవేశించడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్టు పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు ముంబైలోని జాస్లోక్ దవాఖాన, ఐఐటీ-బాంబే పరిశోధకుల అధ్యయనం ఒకటి వెల్లడించింది.
కొవిడ్ నుంచి కోలుకొన్న 17 మంది పురుషుల వీర్యంలోని ప్రొటీన్ స్థాయిలను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చినట్టు పరిశోధకులు తెలిపారు.