ప్రాణాలివ్వడానికి ముస్లింలు ముందుంటారు : సల్మాన్ ఖుర్షీద్
మధ్యప్రదేశ్‌లోని బుల్డోజర్ ఘటనపై కాంగ్రెస్ స్పందించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తీవ్రంగా మండిపడ్డారు. సాక్షాత్తు ప్రభుత్వమే చట్టాన్ని తుంగలో తొక్కితే.. ఇక దేశ భక్తికి ఇక ఏం గౌరవం ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. సొంతంగా ప్రభుత్వమే ఇళ్లపై రాళ్ల దాడులు చేయించిందని ఈయన ఆరోపించారు. అయినా.. ముస్లిం వర్గీయులు దేశం కోసం ప్రాణాలివ్వడానికి సదా సిద్ధంగానే వుంటారని స్పష్టం చేశారు. కానీ.. ఎలాంటి కారణాలు లేకుండా… ఇళ్లపై, పిల్లలపై దాడులు చేస్తే వాళ్ల పరిస్థితి ఏంటని నిలదీశారు. చట్టాన్ని పక్కనబెట్టి, రూల్స్‌ను అతిక్రమించి, ఇళ్లపై దాడులు చేస్తే.. ఇక దేశభక్తికి అర్థమేంటని సల్మాన్ ఖుర్షీద్ విరుచుకుపడ్డారు.
శ్రీరామ నవమి సమయంలో చెలరేగిన ఘర్షణ తర్వాత అక్కడి ప్రభుత్వం 52 ఇళ్లపై దాడులు చేసింది. దుకాణాలను కూడా కూలగొట్టింది. అలాగే 42 మందిపై కేసులు కూడా నమోదు చేసింది. అందులో 35 మంది ముస్లింలు. ఏడు మంది హిందువులు కూడా వున్నారు. ఇక.. ఈ విషయానికి సంబంధించి 144 మందిని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

