Watch: కదులుతున్న బస్సు నుంచి పడబోయిన యువతి.. జుట్టుపట్టుకుని కాపాడిన కండక్టర్
Conductor saves woman | ఒక యువతి కదులుతున్న బస్సు నుంచి రోడ్డుపై పడబోయింది. అప్రమత్తమైన కండక్టర్ ఆమె జుట్టుపట్టుకుని బస్సులోనికి లాగాడు. బస్సు నుంచి పడకుండా ఆమెను కాపాడాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చెన్నై: ఒక యువతి కదులుతున్న బస్సు నుంచి రోడ్డుపై పడబోయింది. అప్రమత్తమైన కండక్టర్ ఆమె జుట్టుపట్టుకుని బస్సులోనికి లాగాడు. బస్సు నుంచి పడకుండా ఆమెను కాపాడాడు. (Conductor saves woman) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ ఈసంఘటన జరిగింది. ఈరోడ్ నుంచి మెట్టూరు వెళ్తున్న బస్సులో కొందరు ప్రయాణికులున్నారు. ఆ బస్సు చిత్తర్ సమీపిస్తుండగా దిగేందుకు ఒక యువతి డోర్ వద్దకు వచ్చింది. అయితే బస్సు ఒక్కసారిగా కుదుపు ఇవ్వగా డోర్ వద్ద ఉన్న ఆమె కదులుతున్న బస్సు నుంచి బయటకు పడబోయింది.
కాగా, బస్సు డోర్ ఫుట్‌బోర్డ్ వద్ద ఉన్న కండక్టర్ వెంటనే స్పందించాడు. బస్సు నుంచి పడబోయిన మహిళ తల జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. ఆమెను బస్సులోకి లాగి కాపాడాడు. మరో ప్రయాణికురాలు కూడా సహకరించింది. అనంతరం స్టాప్ వద్ద బస్సు ఆగడంతో ఆ యువతి దిగింది. తనను కాపాడిన కండక్టర్‌కు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. మరోవైపు ఆ బస్సులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Salute to the Bus Conductor 🫡 pic.twitter.com/0ZgqpgKs93
— RVCJ Media (@RVCJ_FB) February 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

