Bhabanipur bye-election | నేడు నామినేషన్ వేయనున్న సీఎం
Bhabanipur | పశ్చిమబెంగాల్లో మరో హోరాహోరీ పోరుకు తెరలేవనుంది. సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30న ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మరో హోరాహోరీ పోరుకు తెరలేవనుంది. సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30న ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం మమత శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన విషయం తెలిసిందే. బీబేపీ నేత సువేందు అధికారిని ఓడించడానికి నందిగ్రామ్ నుంచి పోటీచేశారు. అయితే గట్టిపోటీనిచ్చిన ఆమె కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఆమె ఏ సభకూ ఎన్నిక కాకుండానే మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టారు.
కాగా, ఆరు నెలల్లోగా శాసనసభకు ఎన్నికకావాల్సిన ఉన్నందున.. భవానీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర వ్యవసాయ మంత్రి సోబన్దేవ్ చటోపాధ్యాయ్.. మమతా బెనర్జి కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో భవానీపూర్‌తోపాటు మరో రెండు స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ గత శనివారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనుంది. వచ్చే నెల 3న ఓట్లను లెక్కిస్తారు. కాగా, మమతా బెనర్జీపై పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఇక ప్రధాన ప్రతిపక్షం తన అభ్యర్థిని బరిలో నిలపనుంది. ఈ సారికూడా మమత ఓటమి ఖాయమని, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిందేనని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

