Classroom Collapsed | విద్యార్థులు భోజనం చేస్తుండగా కూలిన క్లాస్రూమ్ గోడ.. ఆరుగురికి తీవ్ర గాయాలు
బీజేపీ పాలిత గుజరాత్‌లోని ఓ స్కూల్లో విద్యార్థులు మధ్యాహ్న భోనజం చేస్తుండగా తరగతి గది గోడ ఒక్కసారిగా (Classroom Collapsed) కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
వడోదర: బీజేపీ పాలిత గుజరాత్‌లోని ఓ స్కూల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా తరగతి గది గోడ ఒక్కసారిగా (Classroom Collapsed) కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్ వడోదరలోని శ్రీ నారాయణ్ గురుకుల విద్యాలయలో శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విద్యార్థులు లంచ్ చేస్తున్నారు. మొదటి అంతస్థులోని 7వ తరగతి గదిలో విద్యార్థులంతా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటుంటూ భోజనం తింటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తరగతి గది గోడ కూలిపోయింది. దీంతో ఆరుగురు విద్యార్థులు మొదటి ఫ్లోర్ నుంచి కిందపడిపోయారు. శిథిలాలు వారిపై పడటంతో గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిని అక్కడికి చేరుకుని వారిని దవాఖానకు తరలించారు.
వారిలో ఓ విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యాయని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నాడని చెప్పారు. ఆ గోడ పార్కింగ్ ప్రాంతంలో పడిందని, దీంతో సైకిళ్లు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఇదంతా క్లాస్ రూమ్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం ఆవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
#गुजरात के वडोदरा में एक निजी स्कूल की दीवार गिरने से आधा दर्जन बच्चों को चोट लग गई
स्कूल में ये हादसा लंच ब्रेक के दौरान हुआ।#Gujarat #Vadodara #SchoolWallCollapsed @Bhupendrapbjp @GujaratPolice pic.twitter.com/GAdVHpTmB0
— हिंद उवाच (@TheHindUVAACH) July 20, 2024
#WATCH | Gujarat: One student injured after a wall collapsed at a private school in Vadodara (19/07) pic.twitter.com/BTqTwlPTDH
— ANI (@ANI) July 20, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

