CISF Saves French Man | అపస్మారక స్థితిలో ఫ్రెంచ్ జాతీయుడు.. రక్షించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది
CISF Saves French Man | ఫ్రెంచ్ జాతీయుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్పందించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ వ్యక్తికి సీపీఆర్ చేశాడు. ఫ్రాన్స్ దేశీయుడి ప్రాణాలు కాపాడాడు. (CISF Saves French Man) దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది.
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ జాతీయుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్పందించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ వ్యక్తికి సీపీఆర్ చేశాడు. ఫ్రాన్స్ దేశీయుడి ప్రాణాలు కాపాడాడు. (CISF Saves French Man) దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. జనవరి 26న 63 ఏళ్ల ఫ్రెంచ్ జాతీయుడు బెర్ట్రాండ్ పాట్రిక్ ఎయిర్ విస్తారా విమానంలో పారిస్కు వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాడు. సెక్యూరిటీ చెక్ కోసం క్యూలో నిల్చొన్నాడు. వృద్ధుడైన ఆ వ్యక్తి ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయాడు.
కాగా, ఎక్స్-రే స్కానర్ వద్ద విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పునీత్ కుమార్ తివారీ ఇది చూసి వెంటనే స్పందించాడు. ఫ్రెంచ్ జాతీయుడికి కార్డియో పల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేశాడు. దీంతో బెర్ట్రాండ్ పాట్రిక్ తిరిగి స్పృహలోకి వచ్చాడు. ఆ వెంటనే ఎయిర్పోర్ట్లో ఉన్న డాక్టర్ను రప్పించి ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన విమానంలో ప్రయాణించవచ్చని డాక్టర్ నిర్ధారించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు ఈ విషయం తెలిపారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తత, సకాలంలో స్పందించడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

