మోదీతో సీడీఎస్ రావత్ భేటీ.. కరోనా పోరులో ఆర్మీ పాత్రపై వివరణ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సోమవారం కలిశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి సాయుధ దళాలు చేపడుతున్న సన్నాహాలు, సహాయ కార్యకలాపాలను వారిద్దరు సమీక్షించారు. గత 2 సంవత్సరాల్లో పదవీ విరమణ చేసిన లేదా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన సాయుధ దళాలకు చెందిన వైద్య సిబ్బందిని వారి ప్రస్తుత నివాస స్థలానికి సమీపంలోని కరోనా కేంద్రాల్లో సేవలందించాలని కోరినట్లు మోదీకి రావత్ వివరించారు. పదవీ విరమణ చేసిన ఇతర వైద్య అధికారులు అత్యవసర హెల్ప్లైన్ల ద్వారా సంప్రదింపుల కోసం తమ సేవలను అందించాలని కోరినట్లు చెప్పారు. ఆర్మీ కమాండ్ ప్రధాన, కార్ప్స్, డివిజన్ ప్రధాన కార్యాలయాలతోపాటు నేవీ, ఐఎఎఫ్ విభాగాల్లోని సిబ్బందిని కూడా ఆసుపత్రులలో నియమించినట్లు ప్రధాని మోదీకి రావత్ వివరించారు. ఆసుపత్రులలో నర్సింగ్ సిబ్బందిని కూడా పెద్ద సంఖ్యలో నియమించినట్లు వెల్లడించారు.
సాయుధ దళాలకు చెందిన సంస్థల వద్ద ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రులకు పరఫరా చేస్తున్నట్లు సీడీఎస్ రావత్ ప్రధాని మోదీకి వివరించారు. అధిక సంఖ్యలో వైద్య సదుపాయాల ఏర్పాటు, సాధ్యమైన చోట సైనిక వైద్య మౌలిక సదుపాయాలను పౌరులకు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. విదేశాల నుంచి ఆక్సిజన్, ఇతర నిత్యావసరాలను రవాణా చేయడానికి వాయుసేన చేపడుతున్న కార్యకలాపాలను ప్రధాని మోదీతో రావత్ సమీక్షించారు.
కేంద్రీయ, రాష్ట్రీయ సైనిక్ వెల్ఫేర్ బోర్డులు, ప్రధాన కార్యాలయాల్లోని అధికారులను మారుమూల ప్రాంతాలతో సహా సాధ్యమైనంతవరకు మాజీ సైనికులు, మాజీ అధికారులకు వైద్య, ఇతర సేవలు అందించేందుకు సమన్వయం చేసుకోవడంపై ప్రధాని మోదీ, సీడీఎస్ రావత్ చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

