Baby Shower | పోలీసు స్టేషన్లో మహిళా కానిస్టేబుల్‌కు సీమంతం..!
Baby Shower | తమిళనాడు చెన్నైలోని కే2 అయనవరం పోలీసు స్టేషన్లో సౌమ్య రెండేళ్లుగా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. గర్భంతో ఉన్న ప్రతీ మహిళ పుట్టింటివారితో సీమంతం చేయించుకోవాలని ఆశపడుతుంది. ఇదేవిధంగా సౌమ్య కూడా ఆశపడింది. అయితే, అనుకోని కారణాల వల్ల పుట్టినిల్లు అయిన తిరువన్నమలైకి వెళ్లలేకపోయింది. దీంతో సౌమ్య తీవ్ర నిరాశకు గురైంది. పుట్టింటి వారి చేత సీమంతం చేయించుకునే అదృష్టం తనకు లేదని బాధపడింది. ఈ విషయాన్ని గమనించిన తోటి మహిళా కానిస్టేబుళ్లు.. ‘సాటి మహిళగా సీమంతం చేయించుకోవాలనే ఆశ ఉండటం సహజమే.. మరి మనం ఎందుకు ఆమెకు సీమంతం చేయకూడదు’ అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా స్టేషన్ ఎస్సై మురుగేషన్ దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు.
Baby Shower | పుట్టింటికి వెళ్లలేకపోయిన ఓ మహిళా కానిస్టేబుల్‌కు సిబ్బంది పోలీసు స్టేషన్లోనే ఘనంగా సీమంతం నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని జరిపించి నిండు గర్భిణి అయిన కానిస్టేబుల్ ముఖంలో ఆనందాన్ని చూశారు.
తమిళనాడు చెన్నైలోని కే2 అయనవరం పోలీసు స్టేషన్లో సౌమ్య రెండేళ్లుగా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. గర్భంతో ఉన్న ప్రతీ మహిళ పుట్టింటివారితో సీమంతం చేయించుకోవాలని ఆశపడుతుంది. ఇదేవిధంగా సౌమ్య కూడా ఆశపడింది. అయితే, అనుకోని కారణాల వల్ల పుట్టినిల్లు అయిన తిరువన్నమలైకి వెళ్లలేకపోయింది. దీంతో సౌమ్య తీవ్ర నిరాశకు గురైంది. పుట్టింటి వారి చేత సీమంతం చేయించుకునే అదృష్టం తనకు లేదని బాధపడింది. ఈ విషయాన్ని గమనించిన తోటి మహిళా కానిస్టేబుళ్లు.. ‘సాటి మహిళగా సీమంతం చేయించుకోవాలనే ఆశ ఉండటం సహజమే.. మరి మనం ఎందుకు ఆమెకు సీమంతం చేయకూడదు’ అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా స్టేషన్ ఎస్సై మురుగేషన్ దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు.
సౌమ్యకు స్టేషన్లో సీమంతం చేసేందుకు ఎస్సై కూడా ఒప్పుకున్నారు. దీంతో సిబ్బంది అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త చీరతో పాటు పసుపు, కుంకుమ, పండ్లు, స్వీట్లు తీసుకొచ్చారు. నవంబర్ 20వ తేదీన స్టేషన్లోనే సౌమ్యకు సీమంతం ఘనంగా నిర్వహించారు. సౌమ్యను ఆమె భర్తను పక్కపక్కనే కూర్చోబెట్టి వేడుకను జరిపించారు. ఇద్దరినీ నిండు మనసుతో ఆశీర్వదించారు. అంతేకాదు ఆరోజు ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వాళ్లందరికీ స్టేషన్ పరిసరాల్లోనే భోజనాలు కూడా పెట్టించారు. పోలీసులు చేసిన ఈ శుభకార్యాన్ని స్థానికులంతా ప్రశంసించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

