70 ఏండ్లు పైబడిన వారికీ ఆయుష్మాన్ భారత్
దేశంలో 70 ఏండ్లు పైడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వర్తింపజేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. బుధవారం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
- ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపు
- ఈవీల ప్రోత్సాహకానికి 10 వేల కోట్లతో పీఎం ఈడ్రైవ్
- కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశంలో 70 ఏండ్లు పైడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వర్తింపజేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. బుధవారం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏండ్ల వయసు పైబడిన అందరికీ ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందించనున్నట్టు ఆయన తెలిపారు. దీని ద్వారా 4.5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని చెప్పారు.
హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి 12వేల కోట్లు
ఎలక్ట్రిక్ బస్సులు, ఆంబులెన్సులు, ట్రక్కులు సహా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రూ.10,900 కోట్లతో రెండేండ్ల పాటు పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు తెలిపారు. దేశంలో రానున్న ఎనిమిదేండ్లలో 31,350 మెగావాట్లతో నూతన జల విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి రూ.12,461 కోట్లు కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు చెప్పారు.
నాలుగో విడత గ్రామ్ సడక్ యోజన
2024-25 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన-4 అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. దీని ద్వారా 25 వేల ఆవాసాలకు రోడ్డు సదుపాయం కల్పించేందుకు 62,500 కిలోమీటర్ల మేర రోడ్లను, కొత్త వంతెనలను నిర్మించనున్నట్టు తెలిపారు. మొత్తం రూ.70,125 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పథకంలో రూ.49,087 కోట్లు కేంద్రం భరిస్తుందని, మిగతాది రాష్ర్టాలు భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

