దేశంలో విస్తరిస్తున్న మంకీపాక్స్.. కేంద్రం అత్యవసర సమావేశం
Monkeypox | దేశంలో మంకీపాక్స్ విస్తరిస్తున్నది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవగా.. కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ మేనేజ్మెంట్ గైడెలైన్స్‌ను సవరించేందుకు గురువారం ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎమరెన్జీ మెడికల్ రిలీఫ్ (EMR) డైరెక్టర్ ఎల్ స్వస్తి చరణ్ అధ్యక్షతన సమావేశం జరుగుతున్నది.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైసెన్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతినిధులు సైతం భేటీకి హాజరయ్యారు. ఈఎంఆర్ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖలో ఓ విభాగం. ఇది జాతీయ, అంతర్జాతీయంగా ప్రజారోగ్య విషయాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గైడెల్స్‌ను సవరించేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం ఢిల్లీలో నైజీరియాకు చెందిన 31 సంవత్సరాల మహిళకు మంకీపాక్స్ నిర్ధారణైన విషయం తెలిసిందే.
సదరు మహిళ మంగళవారం లోక్ నాయక్ ఆసుపత్రిలో చేరగా.. బుధవారం మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలింది. అయితే, సదరు మహిళకు ఎలాంటి విదేశీ ప్రయాణ చరిత్ర లేదని అధికారులు తెలిపారు. గతంలో పాజిటివ్‌గా తేలిన ముగ్గురు నైజీరియన్ రోగులకు ఒకరితో ఒకరికి పరిచయం లేదని, వీరంతా వేర్వేరు చోట్ల నివసిస్తున్నారని ఆసుపత్రి అధికారులు ధ్రుకవీరించారు. ఇప్పటి వరకు కేరళలో అత్యధికంగా ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో గతంలోనే కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మా కుటుంబాన్ని అంతం చేసేందుకు రూ.600 కోట్ల ‘సుపారీ’
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

