న్యూఢిల్లీ: ‘సర్’ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని విపక్షాలు, యువత, విద్యార్థుల ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్కు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలతో అదనపు భద్రతను కల్పిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆయనకు ఇప్పటికే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. ‘ఎన్నికల సంఘం కార్యాలయం, సీఈసీ నివాసం వద్ద అదనపు భద్రతా సిబ్బందిని మోహరించాం. ఆయన ఇంటి వద్ద 24 గంటలపాటు పోలీసుల కాపలా ఉంటుంది. ప్రస్తుత ముప్పు అంచనా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకొన్నాం’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.