Vijayakanth | ఏంటి కెప్టెన్ విజయకాంత్ ఇలా అయిపోయారు.. కన్నీటిపర్యంతమవుతున్న అభిమానులు
Vijayakanth | కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యంపై కొద్దిరోజులుగా రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నాయి. ఒకానొక సమయంలో ఆయన చనిపోయాడంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ వట్టి పుకార్లేనని విజయకాంత్ సతీమణి కొట్టిపారేశారు. విజయకాంత్ క్షేమంగానే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.
Vijayakanth | కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యంపై కొద్దిరోజులుగా రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నాయి. ఒకానొక సమయంలో ఆయన చనిపోయాడంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ వట్టి పుకార్లేనని విజయకాంత్ సతీమణి కొట్టిపారేశారు. విజయకాంత్ క్షేమంగానే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. కానీ ఆయన అభిమానుల్లో మాత్రం ఒక భయం మాత్రం మిగిలిపోయింది. విజయకాంత్ ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? అని తెలుసుకోవాలని అనుకున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన బయటకు వచ్చారు. డీఎండీకే పార్టీ జనరల్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిక్కిశల్యమై కనిపించిన విజయకాంత్‌ను చూసి అందరూ షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విజయకాంత్ ఆరోగ్యం క్షీణించడంతో డీఎండీకే పార్టీ జనరల్ సెక్రటరీగా ప్రేమలత విజయకాంత్‌ను నియమించారు. ఈ మేరకు తాజాగా డీఎండీకే పార్టీ జనరల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విజయకాంత్ హాజరయ్యారు. కానీ ఆయన నిలబడే స్థితిలో లేరు. కుర్చీకే పరిమితమయ్యారు. కనీసం చేతులు కూడా పైకి ఎత్తలేని స్థితిలో ఆయన కనిపించారు. కార్యకర్తలే ఆయన రెండు చేతులను పైకెత్తి పట్టుకుంటే విజయకేతనం చూపించారు. ఈ దృశ్యాలను చూసిన డీఎండీకే కార్యకర్తలు తట్టుకోలేకపోయారు. విప్లవనాయకుడిగా పేరొందిన తమ నాయకుడు.. ఇంతటి దుస్థితికి రావడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
Captain #Vijayakanth 🥹💔
Praying For His Speedy Recovery 🙏pic.twitter.com/nNq1KkEds6
— Kolly Corner (@kollycorner) December 14, 2023
#WATCH | தேமுதிக பொதுக்குழு மேடையில் விஜயகாந்தை பார்த்ததும் கண்ணீர் சிந்திய பெண் நிர்வாகி!#SunNews | #DMDK | #Vijayakanth | #PremalathaVijayakanth pic.twitter.com/xuuwCfpQVF
— Sun News (@sunnewstamil) December 14, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

