గరెనా ఫ్రీ ఫైర్ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పబ్జీ గేమ్ మన దేశంలో ఎంత పాపులర్ అయిందో… దాని తర్వాత ఫ్రీ ఫైర్ గేమ్ అంత ఫేమస్ అయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ గేమ్‌కు అడిక్ట్ అయిపోయారు. ముఖ్యంగా టీనేజ్ వయసు ఉన్న వాళ్లు అయితే ఈ గేమ్‌కు బానిస అయిపోయారు.
ఈ గేమ్‌లో ప్రతి రోజు కొన్ని చాలెంజ్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే.. తన తల్లిదండ్రులు ఫ్రీ ఫైర్ గేమ్ చాలెంజ్‌లను చేయనీయడం లేదని 14 ఏళ్ల బాలుడు ఫిబ్రవరి 13న సూసైడ్ చేసుకున్నాడు. అయితే.. ఫిబ్రవరి 14నే కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన కొన్ని యాప్స్‌ను భారత్‌లో బ్యాన్ చేసింది. అందులో ఫ్రీ ఫైర్ గేమ్ కూడా ఉంది.
కేవలం గేమ్ ఆడుకోవడానికి తన తల్లిదండ్రులు అనుమతి ఇవ్వకపోవడంతో క్షణికావేశంలో ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
భారత్‌లో ఫ్రీ ఫైర్ గేమ్‌ను బ్యాన్ చేసినా కూడా ఇప్పటికే ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న వాళ్లు ఆ గేమ్‌ను ఆడుకోవచ్చు. ఇక నుంచి గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో ఈ గేమ్ అందుబాటులో ఉండదు. ఈ గేమ్‌లో రెండు వర్షన్లు ఉంటాయి. ఒకటి గరెనా ఫ్రీ ఫైర్ ఇల్యుమినేట్, గరెనా ఫ్రీ ఫైర్ మ్యాక్స్.