కర్ణాటక సీఎంగా బొమ్మై

- బీజేపీ శాసనసభా పక్ష భేటీలో ఎంపిక
- మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై తనయుడు
- యెడ్డీకి అత్యంత నమ్మకస్తుడు.. లింగాయత్
- జేడీఎస్‌తో రాజకీయాల్లోకి వచ్చిన ఇంజనీర్
- 2008లో బీజేపీలో చేరిక.. 3సార్లు ఎమ్మెల్యే
- గత ప్రభుత్వంలో హోం, న్యాయ మంత్రి
- నేడు 11 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం
బెంగళూరు, జూలై 27: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ ఎంపిక చేసింది. మంగళవారం ఇక్కడ సమావేశమైన ఆ పార్టీ శాసనసభా పక్షం తమ నాయకుడిగా బొమ్మైను ఎన్నుకున్నది. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్ఆర్ బొమ్మై తనయుడే బసవరాజు బొమ్మై. 61 ఏండ్ల బొమ్మై బీఎస్ యెడియూరప్ప (యెడ్డీ) ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. సోమవారం యెడ్డీ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొత్త సీఎంగా పలువురి పేర్లను అధిష్ఠానం పరిశీలించినప్పటికీ బొమ్మైకే అవకాశం దక్కింది. దీనికి కారణం… బొమ్మైకు యెడ్డీ మద్దతు ఉండటమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యెడ్డీలాగే బొమ్మై కూడా రాష్ట్రంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన లింగాయత్ వర్గానికి చెందినవారు. శాసనసభా పక్ష సమావేశంలో బొమ్మై పేరును యెడియూరప్ప ప్రతిపాదించగా పలువురు బలపరిచారు. మిగతా అందరూ ఆమోదించారు. బీజేపీ కేంద్ర పరిశీలకులు, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జీ కిషన్‌రెడ్డి సమక్షంలో నగరంలోని ఓ హోటల్లో ఈ సమావేశం నిర్వహించారు. బుధవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని బొమ్మైని కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆహ్వానించారు.
ఇంజనీర్ నుంచి సీఎంగా..
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న బసవరాజ్ బొమ్మై సదర లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు. యెడ్డీకి అత్యంత నమ్మకస్తుడు. మెకానికల్ ఇంజనీర్ అయిన బొమ్మై టాటా గ్రూపులో తన కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత జనతాదళ్ (ఎస్)తో రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాష్ర్టానికి చెందిన సీనియర్ నేతలు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, మాజీ సీఎం దివంగత రామకృష్ణ హెగ్డేతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. బొమ్మై 2008లో బీజేపీలో చేరారు. హోంశాఖతో పాటు శాసనసభా వ్యవహారాలు, న్యాయ శాఖను నిర్వహించారు. గతంలో జల వనరుల మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హవేరి జిల్లాలోని షిగ్గోన్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1956 నుంచి ఇప్పటి వరకు 20 మంది సీఎంలుగా పనిచేయగా వారిలో 8 మంది లింగాయత్ కమ్యూనిటీకి చెందినవారే. యెడ్దీ వీరశైవ లింగాయత్. తమకు ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌లను కాదనే సాహసం బీజేపీ చేయకుండా అదే సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మైను ఎంపిక చేసింది.
సీఎంలైన తండ్రి-కొడుకుల జాబితాలోకి బొమ్మై
తండ్రిలాగే సీఎం పీఠాన్ని అధిష్టించిన తనయులు దేశ రాజకీయాల్లో కొత్త కాదు. కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న బసవరాజ్ బొమ్మై తాజాగా ఆ జాబితాలో చేరారు. బసవరాజ్ బొమ్మై తండ్రి సోమప్ప రామప్ప బొమ్మై (ఎస్ఆర్ బొమ్మై) 1988-1989లో కర్ణాటక సీఎంగా పనిచేశారు. హెచ్డీ దేవెగౌడ, తర్వాత ఆయన కుమారుడు కుమారస్వామి కూడా కర్ణాటక సీఎం పదవిని చేపట్టారు. అలాగే ఇతర రాష్ర్టాల్లో తమ తండ్రుల్లాగే సీఎంలు అయిన తనయుల జాబితాను చూస్తే… ఎం.కరుణానిధి-ఎంకే స్టాలిన్ (తమిళనాడు), వైఎస్ రాజశేఖరరెడ్డి-వైఎస్ జగన్ (ఏపీ), బిజూ పట్నాయక్-నవీన్ పట్నాయక్ (ఒడిశా), దోర్జీ ఖండూ-పెమా ఖాండూ (అరుణాచల్ ప్రదేశ్), శిబూ సోరేన్-హేమంత్ సోరేన్ (జార్ఖండ్), ములాయం సింగ్ యాదవ్-అఖిలేశ్ యాదవ్ (యూపీ), హేమావతి నందన్ బహుగుణ (యూపీ)-విజయ్ బహుగుణ (ఉత్తరాఖండ్), దేవీలాల్-ఓం ప్రకాశ్ చౌతాలా (హర్యానా), శంకర్రావు చౌహాన్-అశోక్ చౌహాన్ (మహారాష్ట్ర). జమ్ముకశ్మీర్‌లో అబ్దుల్లా కుటుంబంలో మూడు తరాల నేతలు తాత-తండ్రి-కొడుకు సీఎంలు అయ్యారు. ఆ ఘనతను షేక్ అబ్దుల్లా, ఫరూక్, ఒమర్ దక్కించుకున్నారు. కశ్మీర్‌లోనే తండ్రి-కుమార్తె (ముఫ్తీ మొహమ్మద్ సయీద్-మెహబూబా ముఫ్తీ) సీఎంలు అయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

