Bombay High Court | వాళ్లు సంఘవిద్రోహ శక్తులు కాదు విద్యార్థులు.. మహా సర్కారుపై బాంబే హైకోర్టు ఫైర్..!
Bombay High Court | మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ నిరసన తెలుపుతున్న విద్యార్థులు సంఘవిద్రోహ శక్తులేమీ కాదని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది. ఉద్యోగ నియామక పరీక్షలు నిష్పక్షపాతంగా నిర్వహించేలా చూడటం ప్రభుత్వ బాధ్యతని స్పష్టంచేసింది.
Bombay High Court : మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ నిరసన తెలుపుతున్న విద్యార్థులు సంఘవిద్రోహ శక్తులేమీ కాదని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది. ఉద్యోగ నియామక పరీక్షలు నిష్పక్షపాతంగా నిర్వహించేలా చూడటం ప్రభుత్వ బాధ్యతని స్పష్టంచేసింది. పరీక్షలపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించింది.
ఎంపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలపై పుణెలో విద్యార్థులు చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా స్థానికులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని విద్యార్థులు భావిస్తే వారికి ఆందోళన చేసే హక్కు ఉంటుందని వ్యాఖ్యానించింది. విద్యార్థులు సన్నద్ధత కోసం ఎంతో సమయం వెచ్చించి ఉంటారని సీజే జస్టిస్ మహేశ్‌చంద్ర త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేథ్నా ధర్మాసనం పేర్కొన్నది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆందోళనలపై అధికారులు సంయమనం పాటిస్తున్నారని, నిరసనకారులపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని తెలిపారు. విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లలో చాలావరకు ప్రభుత్వం నెరవేర్చిందని, ఎంపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా అంశం కూడా గవర్నర్ పరిశీలనకు పంపిందని చెప్పారు. కేసులు నమోదు చేయలేదనే విషయాన్ని హైకోర్టు అభినందిస్తూనే.. ‘వాళ్లు విద్యార్థులు.. సంఘవిద్రోహ శక్తులు కాదు’ అని వ్యాఖ్యానించింది.
ఈ అంశం ఇప్పుడు కోర్టు పరిశీలనలో ఉన్నందున విద్యార్థులు కూడా తమ చదువులపై దృష్టి సారించాలని సూచించింది. తదుపరి విచారణను నవంబర్ 25కు వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

