Bomb threat | పంజాబ్‌లో ఐదు ప్రముఖ ఆలయాలకు బాంబు బెదిరింపులు..!
Bomb threat | పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని ఐదు ప్రముఖ దేవాలయాలకు గురువారం బాంబు బెదిరింపు (Bomb threat) ఈ-మెయిల్స్ (E-mails) వచ్చాయి. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా పేలుళ్లు జరుపుతామని ఆ ఈ-మెయిల్స్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా ఆలయాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
Bomb threat : పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని ఐదు ప్రముఖ దేవాలయాలకు గురువారం బాంబు బెదిరింపు (Bomb threat) ఈ-మెయిల్స్ (E-mails) వచ్చాయి. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా పేలుళ్లు జరుపుతామని ఆ ఈ-మెయిల్స్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా ఆలయాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కాగా మరో రెండు రోజుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ (Operation Blue Star) కు 42 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం పంజాబీల్లో ఆందోళన కలిగిస్తోంది.
బాంబు బెదిరింపు మెయిల్స్‌లో పేర్కొన్న ఆలయాల్లో అమృత్‌సర్‌లోని దుర్గియానా ఆలయం, పఠాన్‌కోట్‌లోని ముక్తేశ్వర్ ధామ్ ఆలయం, జలంధర్‌లోని దేవీ తలాబ్ మందిర్, భటిండాలోని మైసర్ ఖానా ఆలయం, పటియాలాలోని మాతాకాళీ ఆలయం ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఆపరేషన్ బ్లూస్టార్ కు 42 ఏళ్లు కావొస్తుండటంతో ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ బెదిరింపు మెయిల్‌తో భద్రతను మరింత పటిష్టం చేశారు.
ఇప్పటికే దేవీ తలాబ్ ఆలయం వద్ద తనిఖీలు పూర్తయ్యాయని, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు. ప్రజలను భయపెట్టే ఉద్దేశంతో చేసిన నకిలీ బెదిరింపులుగా కనిపిస్తున్నప్పటికీ తాము ఎలాంటి రిస్క్ తీసుకోబోమని చెప్పారు. కాగా, 1984 జూన్‌లో ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా గోల్డెన్ టెంపుల్లో నక్కిన తీవ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం సైనిక చర్య చేపట్టింది. మేజర్ జనరల్ బ్రార్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ‘ఆపరేషన్ బ్లూ స్టార్’.. భారత సైన్యం చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యల్లో ఒకటిగా నిలిచింది.
అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు చేపట్టిన ఆ సైనిక చర్యలో 83 మంది భారత సైనికులు అమరులయ్యారు. వేర్పాటువాద నేత భింద్రన్ వాలేతోపాటు ఇతర వేర్పాటువాద నేతలూ హతమయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

