viral video : స్కూల్ డేస్‌లో మనలో చాలా మంది టీచర్ అంటే ఎంతో అభిమానం చూపుతాం. విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు విద్యార్ధులను సరైన రీతిలో ముందుకు నడిపిస్తూ మార్గదర్శలా టీచర్లు వ్యవహరిస్తుంటారు. ఓ టీచర్ బర్త్‌డేను విద్యార్ధులు స్పెషల్‌గా ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
నేపాల్‌లోని బోర్డింగ్ స్కూల్ గండకి బోర్డింగ్ స్కూల్ (జీబీఎస్)లో ఈ వీడియోను రికార్డు చేశారు. సుజన్ సర్ అనే టీచర్ బర్త్‌డే సందర్భంగా విద్యార్ధులు వినూత్న రీతిలో సెలబ్రేషన్‌కు ప్లాన్ చేశారు. వీడియో ప్రారంభంలో విద్యార్ధులు గొడవ పడుతుండటం కనిపిస్తుంది.
ఇంతలో క్లాస్‌రూంలోకి వచ్చిన సుజన్ సర్ విద్యార్ధులు ఘర్షణ పడుతున్నారని భావించి వారిని విడదీసి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తారు. ఆపై గుంపులోంచి ఓ విద్యార్ధి సుజన్ సర్‌కు బొకే అందించి బర్త్‌డే విషెస్ చెబుతాడు. విద్యార్ధులు తన బర్త్‌డే ప్లాన్ చేసిన తీరుకు టీచర్ ముఖంలో నవ్వులు విరబూయడం ఈ క్లిప్‌లో చూడొచ్చు.
Read More :
Food Habits | తిండి తిప్పలు.. మితం తప్పితే అమృతమైనా విషమే