మహిళా జర్నలిస్టులపై బీజేపీ ఐటీ సెల్ దారుణ వేధింపులు

- శరీరాకృతిపై ట్వీట్లు, రిప్లైలతో రాజకీయ వికృత క్రీడ
- మార్ఫింగ్ ఫొటోలతో అవమానాలు
- పార్టీని విమర్శించే వారే లక్ష్యం
- నోరెత్తకుండా చేయడమే ధ్యేయం
- ‘టెక్ ఫాగ్’పై ద వైర్ వరుస కథనాలు
న్యూఢిల్లీ, జనవరి 16: బీజేపీ సోషల్ వేగు ‘టెక్‌ఫాగ్’ ఆపరేటర్లకు 2018లో పై నుంచి ఓ టాస్క్ వచ్చింది. ఓ యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను పంపించారు. వాటిని యాప్ ద్వారా అన్ని వాట్సాప్ గ్రూపులకు పంపించాలని, సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులకు రిైప్లెగా నగ్న ఫోటోలను ట్వీట్ చేయాలని, ఇవే ఫొటోలను ట్వీట్ చేయాలని, ఫేస్బుక్లో షేర్ చేయాలని సూచించారు. వందలాది ఖాతాల్లో ఈ ఫొటోలు కనిపించాయి. ఈ వేధింపులు భరించలేక ఆ యువతి తన సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేసుకొన్నారు. ఆమె పేరు షీలా రషీద్. జేఎన్‌యూ విద్యార్థిని. బీజేపీ విధానాలను విమర్శించేవారిని ఆ పార్టీ ఐటీ సెల్ ఎలా వేధిస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహిళా జర్నలిస్టులను కూడా బీజేపీ ఐటీ సెల్, బీజేవైఎం దారుణంగా వేధించింది. వీరి ఆలోచనలు సోషల్ మీడియా ద్వారా బయటకు రాకుండా అడ్డుకోవడ మే కాదు వారిని బెదిరించడం, నోరెత్తకుండా చేయ డం ఈ టెక్ ఫాగ్ ఆపరేటర్ల విధుల్లో ఒకటి. బీజేపీ ఐటీ సెల్ టెక్ ఫాగ్ సాయంతో మహిళా జర్నలస్టులను ఎలా వేధించిందన్న దానిపై ‘ద వైర్’ కథనం.
280 మంది మహిళా జర్నలిస్టులపై…
గతేడాది జనవరి 1-మే 31 మధ్య 280 మంది మహిళా జర్నలిస్టుల ట్విట్టర్ యాక్టివిటీని వైర్ పరిశీలించింది. వీరంతా ఈ 4నెలల కాలంలో తమ ట్విట్ట ర్ సంభాషణల్లో 46 లక్షల రిైప్లెలు ఇచ్చారు. ఇందు లో 8 లక్షల రిైప్లెలు టెక్ ఫాగ్ నిర్వహిస్తున్న ఖాతాలకే ఉన్నాయి. టెక్ ఫాగ్ నుంచి వచ్చిన రిైప్లెలలో 5.6 లక్షలు వేధింపుల కిందకు వస్తాయి. వైర్ సంస్థ వెల్లడించిన జాబితాలో జర్నలిస్టు రానా అయ్యూబ్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ జాబితాపై ఆమె స్పందించారు. ‘ఇది నన్నేమీ ఆశ్చర్యపర్చలేదు’ అన్నారు.
15 నిమిషాల్లో 900 ట్వీట్లు
టెక్‌ఫాగ్ యాప్ స్క్రీన్ షాట్లలో ఉన్న డాటాబేస్ ఫోల్డర్లను బట్టి అనుమానం ఉన్న లక్షకు పైగా ట్విట్టర్ ఖాతాలపై వైర్ సంస్థ సాంకేతిక విశ్లేషణ చేపట్టింది. ఖాతా తెరిచిన తేదీ, అందులో పోస్టులు, లైకులు, షేర్లు చేసే విధానాన్ని గమనించింది. ఈ విశ్లేషణలో 40,500 ట్విట్టర్ ఖాతాలు ఎక్కువ యాక్టివ్‌గా ఉన్నట్టు గుర్తించింది. ఇందులో ఒక్కో ఖాతా నుంచి రోజుకు 350 ట్వీట్లు చేస్తున్నట్టు వైర్ తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఒక్కో ఖాతా నుంచి కేవలం 15 నిమిషాల్లోనే 900 ట్వీట్లు అప్లోడ్ అయినట్టు పేర్కొన్నది. ఢిల్లీలో అల్లర్ల సమయంలో విద్వేష ప్రచారం, మర్కజ్ వల్లే కరోనా వ్యాప్తి ఎక్కువైందంటూ ప్రచారం ఇలా జరిగిందని వైర్ తెలిపింది. ఎన్నికల సమయంలో, రాజకీయ పరంగా ముఖ్యమైన సంఘటనల సమయంలో టెక్‌ఫాగ్ ఆపరేటర్లకు పని ఎక్కువగా ఉంటుంది. అందుకే అప్పుడు వాళ్లకి ఇన్సెంటివ్‌లు కూడా ఇస్తారు.
రేపు మన కూతుళ్లకు కూడా ఎదురు కావచ్చు
‘దేశంలో శక్తిమంతమైన రాజకీయ పార్టీ తన వనరులను మహిళలను వేధించడానికి ఉపయోగిస్తున్నది. తద్వారా వారి నోరు మూ యించడానికి ప్రయత్నిస్తున్నది’ అని ప్రముఖ జర్నలిస్టు సాగరిక ఘోష్ అన్నారు. ‘టెక్‌ఫాగ్ అనేది ఏదో గుర్తు తెలియ ని వ్యక్తులు ఉపయోగించేది కాదు. దీన్ని వాడేవారు రాజకీయ వ్యక్తులు. దీనిపై అధికారంలో ఉన్నవారితో పాటు ఇతర నేతలు కూడా మాట్లాడటం లేదు. ఇది రేపు మన కూతుళ్లకు కూడా ఎదురు కావచ్చు’ అని ఆమె ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- IT Cell
- techfog app
- The Wire
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

