Watch: డ్యూటీలో ఉన్న పోలీస్‌ను లాఠీతో కొట్టిన పోలీసులు.. ఎక్కడంటే?
కాగా, లాఠీ దెబ్బలు తిన్న పోలీస్ ఏ మాత్రం ప్రతిఘటించలేదు. అయితే తన మొబైల్ ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడాడు.
చండీగఢ్: డ్యూటీలో ఉన్న పోలీస్‌ను మరో పోలీస్ లాఠీతో కొట్టాడు. అయితే లాఠీ దెబ్బలు తిన్న పోలీస్, తనను కొట్టిన పోలీస్తో వాదనకు దిగినప్పటికీ ఎదురు దాడి చేయలేదు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఈ సంఘటన జరిగింది. గురునానక్ మిషన్ చౌక్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ సమీపం వద్దకు ఒక పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చింది. ఇద్దరు పోలీస్ అధికారులు ఆ వాహనం నుంచి కిందకు దిగారు. రోడ్డుపై నిల్చొని యూనిఫామ్‌లో ఉన్న పోలీస్తో వాదనకు దిగారు. ఈ సందర్భంగా చేతిలో లాఠీ ఉన్న పోలీస్ అధికారి, రోడ్డుపై నిల్చొని ఉన్న పోలీస్ కాళ్లపై పలుమార్లు కొట్టాడు.
కాగా, లాఠీ దెబ్బలు తిన్న పోలీస్ ఏ మాత్రం ప్రతిఘటించలేదు. అయితే తన మొబైల్ ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులు తమ వాహనం వద్దకు వెళ్లారు. మరోవైపు లాఠీ దెబ్బలు తిన్న పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ)కు చెందిన అధికారి కాగా, మిగతా ఇద్దరు పోలీస్ కంట్రోల్ రూమ్ (పీసీఆర్)కు చెందిన వారు. నైట్ డ్యూటీలో ఉన్న ఆ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి మొబైల్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
https://www.youtube.com/watch?v=CAhd8oFpEM0
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

