Child Marriage | కుటుంబం అప్పు చెల్లించలేదని.. ఆరో తరగతి విద్యార్థినిని పెళ్లి చేసుకున్న వ్యక్తి
Child Marriage | అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఒక కుటుంబానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని ఒక వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ బాలికను చదివిస్తానని చెప్పిన అతడు మూడు నెలల కిందట గుట్టుగా ఆమెను పెళ్లి (Child Marriage) చేసుకున్నాడు. రెండో భార్యగా తన ఇంట్లో ఉంచుకున్నాడు.
పాట్నా: అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఒక కుటుంబానికి చెందిన ఆరో తరగతి విద్యార్థినిని ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యగా తన ఇంట్లో ఉంచుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఒక కుటుంబం, మహేంద్ర పాండే అనే వ్యక్తి నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకుంది. అయితే సకాలంలో ఆ డబ్బు చెల్లించలేకపోయింది. దీంతో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని అతడు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ బాలికను చదివిస్తానని ఆ కుటుంబానికి చెప్పిన అతడు మూడు నెలల కిందట గుట్టుగా ఆమెను బాల్య వివాహం (Child Marriage) చేసుకున్నాడు. రెండో భార్యగా తన ఇంట్లో ఉంచుకున్నాడు.
కాగా, దూరపు బంధువైన మహేంద్ర పాండే తమ కుమార్తె అయిన మైనర్ బాలికను రహస్యంగా బాల్య వివాహం చేసుకుని రెండో భార్యగా చూస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహ చట్టం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహేంద్ర పాండేను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. ఆ బాలిక మూడు నెలలపాటు అతడి ఇంట్లో ఉండటంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. మరోవైపు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

