cyber fraud | వాట్సాప్‌లో పెళ్లి ఆహ్వాన పత్రిక డౌన్లోడ్.. పది లక్షలు పోగొట్టుకున్న అధికారి
cyber fraud | పెళ్లి ఆహ్వాన పత్రిక పేరుతో వాట్సాప్‌లో వచ్చిన ఏపీకే ఫైల్‌ను ఒక అధికారి డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో సైబర్ మోసగాళ్లు ఆయన బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి రూ.10 లక్షలు కొల్లగొట్టారు. ఇది తెలుసుకున్న ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బెంగళూరు: పెళ్లి ఆహ్వాన పత్రిక పేరుతో వాట్సాప్‌లో వచ్చిన ఏపీకే ఫైల్‌ను ఒక అధికారి డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో సైబర్ మోసగాళ్లు ఆయన బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి రూ.10 లక్షలు కొల్లగొట్టారు. ఇది తెలుసుకున్న ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. (Cyber Fraud) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. జూలై 14న డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ మొబైల్ ఫోన్లోని వాట్సాప్‌కు వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరుతో ఏపీకే ఫైల్ వచ్చింది. ఆయన దానిని డౌన్లోడ్ చేశారు. దీంతో సైబర్ నేరగాళ్లు ఆయన మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేశారు. ఆ అధికారికి చెందిన ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ ఖాతా నుంచి పలు ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ. 9,96,659 డ్రా చేశారు.
కాగా, సైబర్ మోసం జరిగినట్లు ఆ అధికారి గ్రహించారు. వెంటనే ఆ ఏపీకే ఫైల్‌ను డిలీట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ సైబర్ మోసంపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానిత ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయడం లేదా డౌన్లోడ్ చేయడం వంటివి చేయవద్దని పోలీస్ అధికారి సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

