మోదీ, మమతకు మామిడి పండ్లు పంపిన బంగ్లాదేశ్ పీఎం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 2,600 కేజీల మామిడి పండ్లను బహుమతిగా పంపారు. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ జిల్లాలో ప్రత్యేకంగా పండించే ‘హరిభాంగా’ రకం మామిడి పండ్లను 260 బాక్సుల్లో ఆ దేశ లారీల్లో రవాణా చేశారు. ఆ వాహనాలు బెనాపోల్ చెక్ పాయింట్ ద్వారా ఆదివారం సరిహద్దును దాటి కోల్‌కతా చేరాయి. కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ మొదటి కార్యదర్శి మహ్మద్ సమిల్ క్వాడర్ ఈ మామిడి పండ్ల బాక్సులను స్వీకరించారు. కస్టమ్స్ ఫార్మాలిటీల అనంతరం ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతకు వీటిని పంపనున్నారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య స్నేహానికి చిహ్నంగా ప్రధానమంత్రి షేక్ హసీనా ఈ మామిడి పండ్లను ప్రధాని మోదీ, సీఎం మమతకు బహుమతిగా పంపారని బెనాపోల్ కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ అనుపమ్ చక్మా తెలిపారు. కాగా, బంగ్లాదేశ్‌తో సరిహద్దు కలిగిన ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా మామిడి పండ్లను పంపే యోచనలో షేక్ హసీనా ఉన్నట్లు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

