Viral news | మధ్యప్రదేశ్‌లో వింతశిశువు జననం.. నాలుగు కాళ్లు, నాలుగు చేతులు..!
Viral news | మధ్యప్రదేశ్ (Madhyapradesh) లో ఒక అరుదైన వైద్య పరిణామం చోటుచేసుకుంది. లవ్‌కుష్‌నగర్ (Lavakusha Nagar) లో ఓ మగ శిశువు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ శిశువును చూసేందుకు భారీగా తరలివచ్చారు.
Viral news : మధ్యప్రదేశ్ (Madhyapradesh) లో ఒక అరుదైన వైద్య పరిణామం చోటుచేసుకుంది. లవ్‌కుష్‌నగర్ (Lavakusha Nagar) లో ఓ మగ శిశువు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ శిశువును చూసేందుకు భారీగా తరలివచ్చారు. వైద్యుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. శిశువు ఛాతీ భాగం నుంచి ఈ అదనపు అవయవాలు పెరిగినట్లు గుర్తించారు.
ఈ అసాధారణ పరిస్థితికి జన్యుపరమైన లోపాలు కారణం కావొచ్చని వైద్యులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అదనంగా ఉన్న కాళ్లు, చేతులను శస్త్రచికిత్స ద్వారా తొలగించే అవకాశాలను వారు పరిశీలిస్తున్నారు. అయితే సర్జరీకి ముందు ఆ అవయవాల్లోని రక్త ప్రసరణ వ్యవస్థ, ఎముకల అనుసంధానం వంటి కీలక అంశాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం శిశువుకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే శస్త్రచికిత్సపై తుది నిర్ణయం తీసుకుంటామని వైద్యులు స్పష్టం చేశారు. ఇదిలావుండగా శిశువుకు మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు తక్షణమే స్పందించారు. బాలుడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా జబల్పూర్లోని ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం శిశువు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
4-4 हाथ – पैर वाले बच्चे का जन्म.
लोग देखकर हैरान रह गए 😱 pic.twitter.com/YcleyRp61F
— ओमप्रकाश खीचड़ बीकानेरी (@Omrlp07) August 24, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

