ఆడియోమోజీలు వచ్చేస్తున్నయ్!
కుటుంబ సభ్యులతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ చాట్ చేస్తున్నప్పుడు ఎమోజీలను పంపడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. ఇప్పుడు వీటిని ఫోన్ కాల్స్‌కు కూడా వర్తింపజేయాలని ‘గూగుల్' సరికొత్త ఆలోచన చేస్తున్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: కుటుంబ సభ్యులతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ చాట్ చేస్తున్నప్పుడు ఎమోజీలను పంపడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. ఇప్పుడు వీటిని ఫోన్ కాల్స్‌కు కూడా వర్తింపజేయాలని ‘గూగుల్’ సరికొత్త ఆలోచన చేస్తున్నది. ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్, యానిమేషన్స్తో కూడిన ‘ఆడియోమోజీ’లను యూజర్లకు పరిచయం చేయబోతున్నది. ఈ సరికొత్త ఫీచర్‌ను గూగుల్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నది. ‘ఆడియోమోజీ’గా పిలుస్తున్న ఈ ఫీచర్లో.. స్యాడ్, అప్లాజ్, సెలబ్రేట్,లాఫ్, డ్రమ్రోల్, పూప్.. అనే 6 రకాల ఆడియో ఎమోజీల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. మనకు ఫోన్ చేసిన వ్యక్తి స్మార్ట్‌ఫోన్ తెరపై ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్‌తో, యానిమేటెడ్ ఆడియో ఎమోజీ దృశ్యరూపంలో కనపడుతుంది. గూగుల్ యాప్‌లోని ‘కాల్ స్క్రీన్ ఫీచర్’ను ఎంచుకోవటం ద్వారా ఇది ప్లే అవుతుంది. దీనిపై గూగుల్ అధికారికంగా ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

