Sonia Gandhi | లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగంపై దాడి : సోనియాగాంధీ
Sonia Gandhi | లోక్‌సభ (Lok Sabha) లో సీట్ల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) 'రాజ్యాంగంపై దాడి' గా అభివర్ణించారు. అదేవిధంగా 'నారీ శక్తి వందన్ అధినియమ్' కు సవరణను ప్రవేశపెట్టిన సమయంపై కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. సోమవారం ఓ జాతీయ పత్రికలో ప్రచురితమైన వ్యాసంలో ఆమె కేంద్రంపై విమర్శలు చేశారు.
Sonia Gandhi : లోక్‌సభ (Lok Sabha) లో సీట్ల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) ‘రాజ్యాంగంపై దాడి’ గా అభివర్ణించారు. అదేవిధంగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ కు సవరణను ప్రవేశపెట్టిన సమయంపై కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. సోమవారం ఓ జాతీయ పత్రికలో ప్రచురితమైన వ్యాసంలో ఆమె కేంద్రంపై విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై అఖిలపక్ష సమావేశం (All party meet) ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరినా కేంద్రం తిరస్కరించిందని ఆరోపించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆధిపత్య ధోరణికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేయాలనే ఆలోచనను తాము వ్యతిరేకించడం లేదని, 2027 జనాభా లెక్కలకు ముందే జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని సోనియాగాంధీ స్పష్టంచేశారు. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 29న చివరి దశ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వ కొత్త ప్రతిపాదనలపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ.. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి మూడుసార్లు లేఖలు రాశారని గుర్తుచేశారు. అత్యంత సహేతుకమైన ఈ అభ్యర్థనను తిరస్కరించారని తెలిపారు. అనధికారికంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం అత్యంత ప్రమాదకరమని సోనియాగాంధీ హెచ్చరించారు.
ఏప్రిల్ 16 నుంచి 18 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి బదులుగా.. వర్షాకాల సమావేశాల్లోనే ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ను సవరించే బిల్లు తీసుకురావాలని సోనియాగాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై మధ్యలో ప్రారంభమవుతాయని పేర్కొన్న సోనియా.. ఏప్రిల్ 29న పశ్చిమబెంగాల్లో పోలింగ్ పూర్తవుతుందని, పోలింగ్ ముగిసిన వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, రాజ్యాంగ సవరణ బిల్లులపై చర్చించి, వర్షాకాల సమావేశాల్లో వాటిని పరిగణలోకి తీసుకుంటే ఆకాశమేమీ కూలిపోదని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

