Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
Army Intends To Sack Major | ఇద్దరు ఆర్మీ అధికారుల భార్యలతో వివాహేతర సంబంధాలున్నట్లు ఆర్మీ మేజర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోర్ట్ మార్షల్‌కు బదులుగా పరిపాలనా పరమైన చర్యలు చేపట్టాలని ఆర్మీ భావించింది. ఆ మేజర్‌ను సర్వీస్ నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
న్యూఢిల్లీ: ఇద్దరు ఆర్మీ అధికారుల భార్యలతో వివాహేతర సంబంధాలున్నట్లు ఆర్మీ మేజర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోర్ట్ మార్షల్‌కు బదులుగా పరిపాలనా పరమైన చర్యలు చేపట్టాలని ఆర్మీ భావించింది. ఆ మేజర్‌ను సర్వీస్ నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. (Army Intends To Sack Major) 2023 ఆగస్ట్‌లో ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని అదనపు క్రమశిక్షణ, నిఘా డైరెక్టరేట్ జనరల్‌కు ఒక మేజర్ భార్య ఫిర్యాదు చేశారు. వ్యభిచారం, మాదకద్రవ్యాల వినియోగంతో పాటు ఇద్దరు ఆర్మీ అధికారుల భార్యలతో సహా నలుగురు మహిళలతో తన భర్తకు సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఆ ఏడాది అక్టోబర్‌లో ఈ ఆరోపణలు, మేజర్ ప్రవర్తనపై దర్యాప్తు కోసం విచారణ కోర్టును ఆర్మీ ఏర్పాటు చేసింది.
కాగా, తనపై వచ్చిన ఆరోపణలను తొలి నుంచి ఆ మేజర్ ఖండించారు. తనపై విచారణ వల్ల ఆర్మీ రూల్ 180ను సైన్యం ఉల్లంఘించినట్లు ఆరోపించారు. తాను పదేపదే అభ్యర్థించినప్పటికీ ఆరోపణలలో పేర్కొన్న మహిళలను, వారి భర్తలను ఎప్పుడూ విచారించలేదని ఆయన పేర్కొన్నారు. తన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్‌లతో సహా తన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న విధానంలోనూ, తన నివాసంలో జరిపిన సోదాలలోనూ విధానపరమైన అవకతవకలు జరిగాయని ఎత్తిచూపారు.
మరోవైపు ఆ మేజర్‌పై పరిపాలనా చర్యను ఆర్మీ ఎంచుకున్నది. 2025 మార్చిలో ఆర్మీ చట్టంలోని సెక్షన్లు 45, 63 కింద ఒక తాత్కాలిక ఛార్జిషీట్‌ను రూపొందించింది. ఆ తర్వాత సాక్ష్యాధారాల సారాంశాన్ని, అదనపు సాక్ష్యాధారాలను సిద్ధం చేసింది. అయితే ఆరోపణలలో పేర్కొన్న మహిళలను విచారించాలని ఆ అధికారి మళ్ళీ కోరారు.
ఈ నేపథ్యంలో కోర్ట్-మార్షల్ కు బదులుగా పరిపాలనాపరమైన తొలగింపునకు ఆర్మీ సిద్ధమైంది. ఆర్మీ రూల్స్ 19, 14 కింద, కోర్ట్-మార్షల్ లేకుండా ఆయనను సర్వీస్ నుంచి ఎందుకు తొలగించకూడదో వివరించాలని కోరుతూ ఈ ఏడాది ఆగస్ట్ 10న ఆ అధికారికి షో-కాజ్ నోటీసు జారీ చేసింది. పరిస్థితుల దృష్ట్యా కోర్ట్-మార్షల్ అనుచితమని ఆ నోటీసులో పేర్కొంది.
అయితే ఢిల్లీలోని సాయుధ దళాల ట్రిబ్యునల్ ప్రధాన బెంచ్‌ను ఆ మేజర్ ఆశ్రయించారు. తనపై వచ్చిన ఆరోపణలు లోపభూయిష్టంగా ఉన్నాయని తెలిపారు. ఆర్మీ రూల్ 184 ప్రకారం విచారణ నివేదిక, అభిప్రాయం కాపీలతో పాటు ఆర్మీ రూల్ 22 ప్రకారం అభియోగాల విచారణ ప్రక్రియల కాపీలను కూడా తాను కోరినప్పటికీ అవి తనకు అందలేదని ఆరోపించారు.
అలాగే 2026 మార్చి 30న పరస్పర విడాకులతో తనపై ఆరోపణలు చేసిన భార్యతో వివాహం ముగిసినట్లు ట్రిబ్యునల్‌కు ఆ మేజర్ తెలిపారు. రాజీలో భాగంగా 2023 ఆగస్ట్‌లో దాఖలు చేసిన ఫిర్యాదును ఆమె ఉపసంహరించుకున్నదని పేర్కొన్నారు. తన సర్వీసును రద్దు చేయడానికి గల కారణాలను ఈ ఉపసంహరణ మరింత బలహీనపరుస్తుందని ఆయన వాదించారు.
కాగా, జస్టిస్ రాజేంద్ర మీనన్, లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతిలతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్, అక్టోబర్ 14న ఆ మేజర్‌కు కాస్త ఊరట ఇచ్చింది. షో కాజ్ నోటీసుకు తన అభ్యంతరాలను సమర్పించాలని ఆయనకు సూచించింది. అలాగే ఆ మేజర్ కోరిన పత్రాలను అందజేయాలని ఆర్మీని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

