Discount on I-Phone 12 | ప్రతి ఏడాది మాదిరిగానే టెక్ దిగ్గజం ఆపిల్ ఈ ఏడాది కూడా ఐ-ఫోన్14 తీసుకొస్తున్నది. వచ్చే సెప్టెంబర్ 14న ఆవిష్కరించనున్నది. అయితే, ఇంతకుముందు ఐఫోన్లతో పోలిస్తే ఐఫోన్-14లో కెమెరా, ఇతర ఫీచర్లలో కీలక మార్పులు చేయబోతున్నది. త్వరలో మార్కెట్లోకి రానున్న ఐఫోన్-14లో నెటిజన్లు, యూజర్లలో ఆసక్తి కనిపిస్తున్నది. ఈ తరుణంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఐఫోన్-12పై రూ.20 వేల వరకు భారీ ఆఫర్ ప్రకటించింది. అదెలాగో తెలుసుకుందామా..!
అమెజాన్‌లో 128 జీబీ వేరియింట్ ఐఫోన్-12 ధర రూ.69,900. దీనిపై అమెజాన్ నేరుగా 16 శాతం ధర తగ్గించింది. అంటే ఐఫోన్-12 ధర రూ.10,901లకు తగ్గుతుంది. ఈఎంఐలో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రూ.5000 పెట్టి వస్తువు కొనుగోలు చేస్తే రూ.1000 వరకు డిస్కౌంట్. పాత ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.8,950 వరకు ధర తగ్గుతుంది. ఫోన్ ఎక్స్చేంజ్ సమయానికి దాని మోడల్, పనితీరు ఆధారంగా ధర ఖరారవుతుంది. అంటే అన్ని రకాల ఆఫర్లు కలిసి రూ.20 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.