Madhya Pradesh | బాధితుడు ఒకరైతే.. మరొకరి కాళ్లు కడిగిన మధ్యప్రదేశ్ సీఎం.. కావాలనే డ్రామా ఆడారా?
Madhya Pradesh | ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన ఘటనపై మరో వివాదం తెరపైకి వచ్చింది. అసలైన బాధితుడ్ని దాచేసి, మరొకరి కాళ్లు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కడిగాడని, ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు బీజేపీ ప్రభుత్వం డ్రామా చేసిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Madhya Pradesh | భోపాల్, జూలై 10: ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన ఘటనపై మరో వివాదం తెరపైకి వచ్చింది. అసలైన బాధితుడ్ని దాచేసి, మరొకరి కాళ్లు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కడిగాడని, ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు బీజేపీ ప్రభుత్వం డ్రామా చేసిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మూత్ర విసర్జన ఘటన 2020లో చోటుచేసుకుందని, ఆ వీడియోలో బాధితుడి వయస్సు 16 లేదా 17 ఏండ్లు ఉంటాయని, జిల్లా పోలీసులు, కలెక్టర్ గుర్తించిన బాధితుడు దశ్మత్ రావత్‌కు 36 లేదా 38 ఏండ్లు ఉంటాయని సోషల్ మీడియాలో పోస్టులు వెలువడ్డాయి.
దశ్మత్ రావత్ మీడియాతో చెప్పిన మాటలు అనుమానాల్ని మరింత పెంచాయి. ‘మూడేండ్ల క్రితం జరిగిందీ ఘటన. మద్యం సేవించడంతో మూత్ర విసర్జన ఎవరు చేశారన్నది తెలియలేదు. నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి.. అధికారులు చెప్పిందే నేను నమ్ముతున్నా’ అన్న దశ్మత్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఇదంతా పెద్ద కుట్ర, నిజమైన బాధితుడ్ని దాచేశారు, ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

