న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మే నెలలో 14 వేల మంది ఉద్యోగులపై వేటు వేయనుందని వార్తలు వచ్చాయి. లేఆఫ్నకు గురయ్యే అవకాశం ఉన్న ఉద్యోగులు తమ సమస్య గురించి అజ్ఞాతంగా జాబ్ ఫోరమ్ బ్లైండ్, చైనీస్ టెక్ పోర్టల్ లీ ఫెంగ్ నెట్వర్క్లలో చర్చించినట్టు సమాచారం.
ఎల్5 నుంచి ఎల్7 స్థాయి వరకు ఉన్న వైట్ కాలర్ ఉద్యోగులను లేఆఫ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలను అమెజాన్ అధికార ప్రతినిధి ఖండించారు.