Andy Jassy | కెరీర్లో ఎదగాలంటే ఏం చేయాలి..? : యువ ప్రొఫెషనల్స్‌కు అమెజాన్ సీఈవో సూచనలివే..!
Andy Jassy : విజయవంతమైన కెరీర్ కోసం ఏం చేయాలనే ప్రశ్న నిరంతరం యువ ప్రొఫెషనల్స్‌ను వెంటాడుతుంది. నిజాయితీగా మాట్లాడుకుంటే దీనికి కచ్చితమైన సమాధానం కూడా లభించక ఎంతో మంది సతమతమవుతుంటారు.
Andy Jassy : విజయవంతమైన కెరీర్ కోసం ఏం చేయాలనే ప్రశ్న నిరంతరం యువ ప్రొఫెషనల్స్‌ను వెంటాడుతుంది. నిజాయితీగా మాట్లాడుకుంటే దీనికి కచ్చితమైన సమాధానం కూడా లభించక ఎంతో మంది సతమతమవుతుంటారు.
దీనికి టెక్ ప్రపంచంలో ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తుంటారు. కెరీర్ ఆరంభంలో బాగా కష్టపడాలని కొందరు చెబుతుంటే మరికొందరు మానసికంగా దృఢంగా ఉండటం కూడా కీలకమని, ఆత్మ విశ్వాసం ముఖ్యమని సూచిస్తుంటారు.
ఇక ఏ దశలోనైనా నేర్చుకునేందుకు సంసిద్ధంగా ఉండటం కెరీర్ ఎదుగుదలలో ప్రొఫెషనల్స్‌కు కలిసివచ్చే అంశమని అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ చెబుతున్నారు. సరైన దృక్పధంతో వ్యవహరించడం, నేర్చుకునేందుకు సన్నద్ధంగా ఉండటం కీలకమని లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లన్స్కీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాస్సీ పలు వివరాలు పంచుకున్నారు. మీ ఉద్యోగంలో మీరు ఓ దశకు చేరుకున్నారంటే మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదని అర్ధం కాదని స్పష్టం చేశారు.
తన కెరీర్ ఆరంభంలో తాను చూసిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారనే విషయంలో నేర్చుకోవడంలో వారు ఎంత గొప్పగా వ్యవహరించారనేది భారీ వ్యత్యాసం చూపుతున్నదని జాస్సీ చెప్పుకొచ్చారు. కొందరు వ్యక్తులకు వారి కెరీర్లో ఓ నిర్ధిష్ట దశకు చేరుకున్న తర్వాత నేర్చుకోవడం అనేది ముప్పుగా మారుతుందని అన్నారు. మీకు అన్నీ తెలుసు అనుకున్న మరుక్షణం నుంచీ మీరు విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తారని చెప్పారు.
ప్రొఫెషనల్స్ తమ కెరీర్ ప్రస్ధానంలో ఎన్నో విషయాలను ఎంచుకుంటూ వెళతారని, అయితే చివరికి వారు మంచివాటిని కనుగొంటారని యాండీ జాస్సీ చెప్పుకొచ్చారు. తాను స్కూల్ విద్యార్ధిగా ఉన్నప్పుడు అథ్లెట్ కావాలనుకున్నానని, అన్ని రకాల స్పోర్ట్స్ ఆడుతూ మైదానంలో ఎంతో సమయం గడిపినా క్రీడాకారుడు అయ్యేంత సత్తా తనలో లేకపోయిందని గుర్తుచేసుకున్నారు.
తాను ప్రొఫెషనల్ అథ్లెట్ అవుతాననే భ్రమలో గడిపానని..ఆ క్రమంలో టెన్నిస్, సాకర్ నేషనల్ టోర్నీల్లో పాల్గొన్నానని తెలిపారు. తాను ప్రొఫెషనల్ అథ్లెట్‌కు సరిపోనని, అందుకే అథ్లెట్ కాలేకపోయానని చెప్పుకొచ్చారు.
Read More :
Mouni Roy | బ్లూ బికినీలో మతులు పోగొడుతున్న మౌనీ రాయ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

