ఆశిష్ రేపు పోలీసుల ఎదుట హాజరవుతాడు: అజయ్ మిశ్రా

లక్నో: తన కుమారుడు ఆశిష్ మిశ్రా శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుట హాజరవుతాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై వివరణ ఇచ్చిన ఆయన శుక్రవారం లక్నోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన కుమారుడికి పోలీసులు గురువారం సమన్లు ఇచ్చారని, అయితే ఆరోగ్య కారణాల వల్ల పోలీసుల ఎదుట కు శుక్రవారం రిపోర్ట్ చేయలేకపోయినట్లు అజయ్ మిశ్రా చెప్పారు. తన కుమారుడు పోలీసులకు శనివారం రిపోర్ట్ చేస్తాడని ఆయన అన్నారు.
తన కుమారుడు ఆశిష్ మిశ్రా ఎక్కడికీ పారిపోలేదని, దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తాడని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా మీడియాకు తెలిపారు. ప్రతిపక్షం ప్రతి అంశంపై తన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నదని ఆయన ఆరోపించారు. దర్యాప్తు మొదలైతే అసలు విషయాలు బయటకు వస్తాయని అన్నారు. నిజమే గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, లఖింపూర్ ఖేరీలో ఆదివారం నిరసన చేస్తున్న రైతులపైకి వాహనాన్ని దూకించి రైతులను తొక్కించి హత్య చేసినట్లు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై రైతు సంఘాలు ఆరోపించాయి. ఈ ఘటనతోపాటు అనంతరం జరిగిన ఆందోళనలో మొత్తం 8 మంది మరణించారు. మృతుల్లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, ముగ్గురు ఇతరులు ఉన్నారు.
ఆశిష్ మిశ్రాపై కేసు నమోదు చేసిన యూపీ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం సమన్లు జారీ చేశారు. శుక్రవారం ఆయన హాజరుకాకపోవడంతో ఈ ఉదయం రెండోసారి సమన్లు జారీ చేసి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా నివాసం వద్ద అంటించారు. శనివారం ఉదయం 11 గంటలకు పోలీస్ కార్యాలయానికి రావాలని అందులో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

