వాయు కాలుష్యానికి 20 లక్షల మంది బలి!
భారతదేశంలో 2023లో వాయు కాలుష్యం కారణంగా 20 లక్షల మందికిపైగా ప్రజలు మృత్యువాత పడినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(ఫిక్కీ), ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై) సంయుక్త నివేదిక వెల్లడించింది. దీనికితోడు ఇప్పుడు ఈ దీపావళి కారణంగా తలెత్తే వాయు కాలుష్యం మరింత ముప్పుగా మారనుంది.
- పటాకుల పొగతో ముప్పు
- గ్రీన్ క్రాకర్స్ కూడా సేఫ్ కాదు
- తీవ్రంగా హెచ్చరిస్తున్న వైద్యులు
న్యూఢిల్లీ: భారతదేశంలో 2023లో వాయు కాలుష్యం కారణంగా 20 లక్షల మందికిపైగా ప్రజలు మృత్యువాత పడినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(ఫిక్కీ), ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై) సంయుక్త నివేదిక వెల్లడించింది. దీనికితోడు ఇప్పుడు ఈ దీపావళి కారణంగా తలెత్తే వాయు కాలుష్యం మరింత ముప్పుగా మారనుంది. ‘క్లీన్ ఎయిర్.. హెల్తీ ఇండియా’ నివేదిక ప్రకారం కాలుష్యాన్ని పర్యావరణ సమస్యగానే కాకుండా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి.
పీఎం 2.5(గాలిలో కలిసిపోయే అతిసూక్ష్మ ధూళి కణాలు) ఊపిరితిత్తులలోకి ప్రవేశించి, రక్తంలో కలవడం వల్ల శ్వాసకోశ, గుండె జబ్బులు, పక్షవాతం, జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయని నివేదిక హెచ్చరించింది. జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం(ఎన్సీఏపీ)లో పీఎం 2.5 తగ్గింపు లక్ష్యాలు నిర్దేశపరచాలని, కాలుష్య పర్యవేక్షణను విస్తరించాలని సూచించింది.
పటాకుల పొగతో ప్రాణాలకే ప్రమాదం
దీపావళి వేడుకల్లో కాల్చే పటాకులు ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్ సైతం పూర్తిగా సురక్షితం కాదని స్పష్టం చేశారు. పటాకుల నుండి వెలువడే పీఎం 2.5, పీఎం 10 ధూళి కణాలతో పాటు నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్ మోనాక్సైడ్ శ్వాసకోశ సమస్యలను పెంచుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

