అమృత్సర్ టు దుబాయ్.. విమానంలో ఒక్కడే ప్రయాణికుడు

న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాకు చెందిన విమానం.. అమృత్సర్ నుంచి దుబాయ్‌కు ఒకే ఒక ప్యాసింజర్‌తో వెళ్లింది. ఆ విమానంలో పారిశ్రామికవేత్త ఎస్పీ సింగ్ ఒబ్రాయ్ ప్రయాణించారు. ఎకానమీ క్లాస్ టికెట్‌తో ఆయన ఒక్కరే ఆ విమానంలో వెళ్లారు. ఒబ్రాయ్కు గోల్డెన్ వీసా ఉంది. దాని కాలపరిమితి పదేళ్లు. యూఏఈ రెసిడెంట్ ఆయన. అమృత్‌సర్‌లో బుధవారం తెల్లవారుజామున 3.45 నిమిషాలకు ఆ విమానం బయలుదేరినట్ల అధికారులు తెలిపారు. ప్రయాణ సమయంలో ఆయన .. ఆ విమాన సిబ్బందితో ఫోటోలు దిగారు. అయితే గడిచిన కొన్ని వారాల్లో.. దుబాయ్‌కు వెళ్తున్న విమానంలో ఒకే ఒక ప్యాసింజెర్ ఉండడం ఇది మూడవ సారి. ముంబై నుంచి దుబాయ్‌కి వెళ్లిన ఎమిరేట్స్ విమానంలో భవేశ్ జవారీ అనే వ్యక్తి ఒక్కరే ప్రయాణించారు. ముంబై నుంచి వెళ్లిన మరో విమానంలో ఓస్వాల్డ్ రోడ్రిగ్స్ అనే వ్యక్తి ప్రయాణించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

