Threat Letter | మోదీపై బాంబు దాడి జరుగుతుందని బెదిరింపు.. కేరళ బీజేపీ చీఫ్‌కు అందిన లేఖపై దర్యాప్తు
Threat Letter | ఇంటెలిజెన్స్ ఏడీజీపీ రిపోర్ట్‌లో పేర్కొన్న ఈ బెదిరింపు లేఖ గురించి మీడియాలో ఆదివారం బయటపడింది. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ దీని గురించి మాట్లాడారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీడియాకు లీక్ కావడంపై మండిపడ్డారు.
తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24, 25 తేదీల్లో కేరళలో పర్యటించనున్నారు. తిరువనంతపురం, కొచ్చిలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అయితే ప్రధాని మోదీ కేరళ టూర్ సందర్భంగా ఆయనపై ఆత్మాహుతి బాంబు దాడి జరుగుతుందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే సురేంద్రన్‌కు గత వారం ఒక బెదిరింపు లేఖ (Threat Letter) అందింది. కొచ్చికి చెందిన వ్యక్తి పేరుతో మలయాళంలో రాసి ఉన్న ఆ లెటర్‌ను పోలీసులకు ఆయన అందజేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని కోరారు.
కాగా, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ రిపోర్ట్‌లో పేర్కొన్న ఈ బెదిరింపు లేఖ గురించి మీడియాలో బయటపడింది. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ దీని గురించి మాట్లాడారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీడియాకు లీక్ కావడంపై మండిపడ్డారు. కేరళ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, ఇతర ప్రముఖుల భద్రతా బాధ్యతలు చూసే పోలీస్ అధికారుల పేర్లు, వారి విధుల గురించిన పూర్తి వివరాలు 49 పేజీల రిపోర్ట్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్ విషయంలో పోలీసులు పెద్ద తప్పు చేశారని, దీనిపై దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశారు. ఈ నివేదిక వాట్సాప్‌లో లీక్ కావడం తీవ్రమైన అంశమని కేంద్ర సహాయ మంత్రి వీ మురళీధరన్ విమర్శించారు. సీఎం విజయన్ దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ బెదిరింపు లేఖపై కేరళ పోలీసులు, కేంద్ర సంస్థలు దర్యాప్తు చేపట్టాయి. ఆ లెటర్లోని పేరు, మొబైల్ నంబర్ ఉన్న కొచ్చి నివాసి ఎన్జే జానీని కేరళ పోలీసులు ప్రశ్నించారు. అయితే ఈ బెదిరింపు లేఖ గురించి తనకు ఏమీ తెలియదని అతడు చెప్పాడు. లేఖలో ఉన్న చేతి రాతను తన రాతలో పోలీసులు సరి చూసుకున్నట్లు మీడియాతో అన్నాడు. స్థానిక చర్చికి సంబంధించిన అంశంలో అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో తమకు విభేదాలు ఉన్నట్లు జానీ కుటుంబం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖ వెనుక ఆ వ్యక్తి ప్రమేయం ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఓటే ఆయుధం’
MANIKANDA | అయ్యప్పపై ‘మాలికాపూరం’ దర్శకుడి కొత్త చిత్రం.. ‘మణికంఠ’ ఫస్ట్ లుక్ విడుదల
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
NZvsIND: ఇండియా టార్గెట్ 199
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

