AAP MP Sanjay Singh | దేశంలో నియంతృత్వ పాలన.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఫైర్
AAP MP Sanjay Singh | దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) మండి పడ్డారు.
AAP MP Sanjay Singh | దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) మండి పడ్డారు. ఏదో ఒకరోజు దేశంలో నరేంద్రమోదీ నియంతృత్వం అంతం అవుతుందని అన్నారు. మోదీని దేవుడు కూడా క్షమించడని వ్యాఖ్యానించారు. దేశంలోనే ఉత్తమ విద్యాశాఖ మంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియా (Manish Sisodia)ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారన్నారు.బ్యూరోక్రాట్ స్టేట్ మెంట్ ఆధారంగా మనీశ్ సిసోడియా (Manish Sisodia) ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. సీబీఐ అధికారుల ముందు మనీశ్ సిసోడియా (Manish Sisodia) విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కీలక ఆప్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు.
ये मोदी जी की पुलिस है अपराध रुके न रुके @msisodia की गिरफ़्तारी के लिये पूरी ताक़त लगा दी है।@AamAadmiParty के नेताओं को House arrest किया जा रहा है।@ArvindKejriwal से इतना क्यों डरते हो मोदी जी?
इन हथकंडों से कुछ नही होगा। pic.twitter.com/iFpeVxqakr— Sanjay Singh AAP (@SanjayAzadSln) February 26, 2023
‘ఈ మోదీ పోలీసులు నేరాలను నివారించవచ్చు. నివారించలేకపోవచ్చు. కానీ మనీశ్ సిసోడియా(Manish Sisodia) ను అరెస్ట్ చేయడానికి వారి అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. పలువురు ఆప్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ అంటే ఎందుకు భయం మోదీజీ అని సంజయ్ సింగ్ (Sanjay Singh) ట్విట్టర్ లో ప్రశ్నించారు. సంజయ్ సింగ్ తన నివాసం బయట మోహరించిన పోలీసు బలగాల చిత్రాలను ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇదే కేసులో ఇంతకుముందు పలు దఫాలు మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మనీశ్ సిసోడియా (Manish Sisodia) అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.
आज फिर CBI जा रहा हूँ, सारी जाँच में पूरा सहयोग करूँगा. लाखों बच्चो का प्यार व करोड़ो देशवासियो का आशीर्वाद साथ है
कुछ महीने जेल में भी रहना पड़े तो परवाह नहीं. भगत सिंह के अनुयायी हैं, देश के लिए भगत सिंह फाँसी पर चढ़ गए थे. ऐसे झूठे आरोपों की वजह से जेल जाना तो छोटी सी चीज़ है— Manish Sisodia (@msisodia) February 26, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

