50 ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయింది.. చివరకు గూగుల్‌లో రూ.కోటి ప్యాకేజీతో జాబ్ కొట్టింది
అందరికీ ఒకే రోజు జాబ్ రాదు. ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినంత మాత్రాన.. తాము ఇక జాబ్‌కు పనికిరామని కాదు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడమే
ప్రతి రోజూ కొన్ని వేల మంది జాబ్ ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతుంటారు. అందులో కొందరు సక్సెస్ అవుతారు.. కొందరు ఫెయిల్ అవుతారు. అందరికీ ఒకే రోజు జాబ్ రాదు. ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినంత మాత్రాన.. తాము ఇక జాబ్‌కు పనికిరామని కాదు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడమే సక్సెస్‌కు తొలి మెట్టు అని నిరూపించింది ఓ యువతి.
తనే సంప్రీతి యాద్. తన వయసు 24 ఏళ్లే. కానీ.. ఏకంగా గూగుల్‌లో కోటి రూపాయల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టేసింది. గూగుల్‌లో జాబ్ సంపాదించడానికి ముందు తను సుమారు 50 ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయింది. అయినా కూడా తన సంకల్పాన్ని మాత్రం వదల్లేదు. రూ.1.10 కోట్ల ప్యాకేజ్‌తో లండన్‌లో ఉన్న గూగుల్ ఆఫీసుకు సెలెక్ట్ అయింది.

నేను ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు చాలా నెర్వస్‌గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ.. నాకు ఎప్పుడూ నా తల్లిదండ్రులు, క్లోజ్ ఫ్రెండ్స్ తోడున్నారు. వాళ్లే నన్ను ఎంకరేజ్ చేశారు. పెద్ద పెద్ద కంపెనీల గురించి తెలుసుకోవడం కోసం చాలా సమయం వెచ్చించాను. పెద్ద పెద్ద కంపెనీలలో ఇంటర్వ్యూ అంటే అది ఒక డిస్కషన్లాగానే ఉంటుంది. ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం నాకు ఇంటర్వ్యూలలో కాన్ఫిడెన్స్‌ను ఇచ్చింది.. అని యాదవ్ చెప్పుకొచ్చింది.

2021లో ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా పొందిన సంప్రీతి యాదవ్.. సాఫ్ట్వేర్ జాబ్‌కు ట్రై చేయడానికి ముందు కంటెంట్ క్రియేటర్ కావాలని అనుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే సంప్రీతికి క్లాసికల్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సంప్రీతి తండ్రి ఎస్బీఐ బ్యాంక్‌లో పని చేస్తుంటాడు. తన తల్లి శశి ప్రభ కూడా ప్రభుత్వ ఉద్యోగినే. బీహార్‌లో ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుంది. వాళ్లే నా ఇన్సిపిరేషన్.. వాళ్లను చూసే నేను అన్నీ నేర్చుకున్నా. చివరకు అనుకున్నది సాధించా. అనుకున్నదానికంటే ఎక్కువే సాధించా.. అని సంప్రీతి తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

