Aaditya Thackeray | శివసేన (యూబీటీ) శాసనసభా పక్ష నేతగా ఆదిత్య ఠాక్రే
Aaditya Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) శాసనసభా పక్ష నేతగా ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేను ఎన్నుకున్నారు. అసెంబ్లీలో ఆ పార్టీ గ్రూప్ నేతతోపాటు పార్టీ చీఫ్ విప్ పదవులను భర్తీ చేశారు.
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) శాసనసభా పక్ష నేతగా ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేను (Aaditya Thackeray) ఎన్నుకున్నారు. అసెంబ్లీలో ఆ పార్టీ గ్రూప్ నేతతోపాటు పార్టీ చీఫ్ విప్ పదవులను భర్తీ చేశారు. సోమవారం ముంబైలో శివసేన (యూబీటీ) శాసన సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఆదిత్య ఠాక్రేను ఎన్నుకున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ గ్రూప్ లీడర్‌గా మాజీ మంత్రి భాస్కర్ జాదవ్, పార్టీ చీఫ్ విప్‌గా సునీల్ ప్రభు ఎన్నికయ్యారు. శివసేన (యూబీటీ) శాసనసభ్యుల సమావేశం తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత అంబాదాస్ దన్వే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నియోజకవర్గం నుంచి ఆదిత్య ఠాక్రే పోటీ చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన మిలింద్ దేవరాపై 8,801 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో 67,427 ఓట్ల మెజార్టీతో ఆదిత్య ఠాక్రే గెలిచారు. ఈ ఓట్ల మార్జిన్ ఈసారి బాగా తగ్గింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

