రన్నింగ్ ట్రైన్ ముందు దూకిన మహిళ.. వీడియో
Woman jumped before train: సరిగ్గా అప్పుడే ఎదురుగా లోకల్ రైలు వస్తుండటం గమనించిన నిందితురాలు ఒక్కసారిగా మహిళా కానిస్టేబుల్‌ను విదిలించుకుని రైలు పట్టాలపై దూకేసింది.

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్లో ఓ మహిళకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. అకస్మాత్తుగా రైలు ముందు దూకిన మహిళను పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ కేసులో నిందితురాలిగా మహిళను విచారణ నిమిత్తం ఒక మహిళా కానిస్టేబుల్, మరో మేల్ కానిస్టేబుల్ కస్టడీలో ఒక ఏరియా నుంచి మరో ఏరియాకు తీసుకెళ్తున్నారు. దాదర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత మేల్ కానిస్టేబుల్ ముందు నడుస్తుండగా మహిళా కానిస్టేబుల్ నిందితురాలిని పట్టుకుని వెనుకాలే వస్తున్నది.
సరిగ్గా అప్పుడే ఎదురుగా లోకల్ రైలు వస్తుండటం గమనించిన నిందితురాలు ఒక్కసారిగా మహిళా కానిస్టేబుల్‌ను విదిలించుకుని రైలు పట్టాలపై దూకేసింది. వెంటనే గమనించిన మేల్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి రైల్వే ట్రాక్‌పై దూకి నిందితురాలిని రక్షించారు. కాగా, ఉన్నట్టుండి మహిళ ఒకేసారి రైలు ముందు దూకడంతో రైల్వేస్టేషన్లో కలకలం చెలరేగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Maharashtra: A police personnel saved life of a woman who is accused in a case, when she jumped in front of a train at Dadar Railway station in Mumbai yesterday. pic.twitter.com/rYNMMJkI8G
— ANI (@ANI) May 29, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

