viral video | ఫొటోకు ఫోజివ్వాలని సర్ధార్జీని కోరిన ఫొటోగ్రాఫర్ : పెద్దాయన రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా
ఫొటో తీసుకునేందుకు అనుమతించాలని ఓ పెద్దాయనను ఫొటోగ్రాఫర్ కోరగా వృద్థుడు సహకరించిన తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుతేజ్ సింగ్ పన్ను ఈ వీడియోను (viral video) ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
న్యూఢిల్లీ : ఫొటో తీసుకునేందుకు అనుమతించాలని ఓ పెద్దాయనను ఫొటోగ్రాఫర్ కోరగా వృద్థుడు సహకరించిన తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుతేజ్ సింగ్ పన్ను ఈ వీడియోను (viral video) ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. వైరల్ క్లిప్‌లో పెద్దాయన రియాక్టయిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో దారివెంట వెళుతున్న సిక్కు వ్యక్తిని ఫొటో తీసుకుంటానని సుతేజ్ సింగ్ కోరగా ఆ పెద్దాయన సంతోషంగా అంగీకరించడం కనిపిస్తుంది.
కుర్తాను సరిచేసుకుని ఫొటోకు ఫోజు ఇవ్వడం ఈ వీడియోలో చూడొచ్చు. ఫొటో ప్రింటవుట్‌ను కూడా పెద్దాయన అడిగి తీసుకుంటాడు. ఈ ఫొటోను తమ పిల్లలకి ఇస్తే వారు తరాల తరబడి దీన్ని జ్ఞాపకంగా దాచుకుంటారని ఆయన చెబుతుండటం అందరి కండ్లు చెమరుస్తుంది. ఈ ఫొటోను చూసి తమ కుటుంబం మురిసిపోతుందని ఫొటోగ్రాఫర్‌తో చెబుతాడు.
స్వీయ విచారణ అనేది మీ నిజమైన స్థితిని గ్రహించడమని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఏకంగా 70 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఇలాంటి ఎన్నో హృదయాన్ని హత్తుకునే అంశాలను ముందుకు తెస్తున్నారని ఓ యూజర్ సుతేజ్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు. మీ పోస్ట్‌లు ఎంతో బావుంటాయి..ఇలాంటి ప్రేమను మీరు కురిపిస్తూనే ఉండండని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More
Priyanka Chopra | ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఇంతవరకూ చూడలేదు.. ప్రియాంక షాకింగ్ కామెంట్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

