ముంబై: ముంబైలో 28 ఏళ్ల వ్యక్తి ట్రాన్స్‌జెండర్(Transgender) అని చెప్పి ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. చెడు దృష్టి తీసివేస్తానని చెప్పి ఆ ఇంట్లో ఉన్న మహిళను నమ్మించాడు. ఆ ట్రాన్స్‌జెండర్ ఇంట్లో అడుగుపెట్టి బెడ్రూమ్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా మహిళను రేప్ చేశాడు. ఈ ఘటన పోవాయిలో జరిగింది. నిందితుడిని అనిల్ శేష్రావ్ షిండేగా గుర్తించారు. ఆగస్టు 18వ తేదీన ఈ ఘటన జరిగింది. దిష్టి తీసివేస్తానని చెప్పిన ఆ ట్రాన్స్‌జెండర్ బాధితురాలిపై భౌతికంగా దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోవాయి పోలీసు స్టేషన్లో లైంగిక దాడి కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫూటేజ్‌ను చెక్ చేస్తున్నారు. నిందితుడిని ట్రాక్ చేస్తున్నారు.
చీర కట్టుకుని వెళ్తున్న అతను.. ఓ ఆటోరిక్షాలో థానేలోని ఖారేగావ్ మురికివాడలోకి ప్రవేశించాడు. అయితే ఆ నిందితుడి పోలీసులు అరెస్టు చేశారు. ట్రాన్స్‌జెండర్‌గానే కాకుండా ఓ బిచ్చగాడిగా కూడా నిందితుడు వేషం వేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులను ఇంట్లోకి ప్రవేశం కల్పించరాదన్నారు.