న్యూఢిల్లీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసికి చెందిన జాన్స్ చీక్స్ అనే వ్యక్తి ఇటీవల ఓ లాటరీ(Lottery) గెలిచాడు. పవర్‌బాల్, డీసీ లాటరీ కంపెనీలో అతను 340 మిలియన్ల డాలర్ల లాటరీలో విజేతగా నిలిచాడు. ఆ లాటరీ అమౌంట్ 2800 కోట్లు. జనవరి 6, 2023న జాన్ చీక్స్ ఆ లాటరీ టికెట్ కొన్నాడు. అయితే ఇప్పుడు ఆ లాటరీ విజేత న్యాయ పోరాటానికి దిగాడు. టికెట్ డ్రా తీసిన రోజు.. డీసీ లాటరీ వెబ్సైట్లో జాన్ చీక్స్ లాటరీ నెంబర్ కనిపించింది. కానీ లాటరీ కంపెనీ మాత్రం ఆ వార్తను ఖండించింది. నెంబర్ పొరపాటును పబ్లిష్ చేసినట్లు డీసీ లాటరీ కంపెనీ తెలిపింది. దీంతో అతను లీగల్ పోరాటానికి సిద్దమయ్యాడు. తనకు నష్టపరిహారం ఇవ్వాలని ఆ వ్యక్తి లాటరీ కంపెనీపై కేసు వేశాడు.