చెన్నై, డిసెంబర్ 27: ఆధార్‌కార్డు.. సిమ్‌కార్డు దగ్గరి నుంచి పాన్ కార్డు, బ్యాంక్ లావాదేవీలు, విమానయానం ఇలా అన్నింటికి అవసరమే. అయితే, తమిళనాడు ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నది. ఆధార్ కార్డుకు సమాంతరంగా ఉండేలా తమిళనాడు ప్రజల కోసం మక్కల్ కార్డును తీసుకురావాలని నిర్ణయించింది. పది నుంచి 12 అంకెలతో దీనిని రూపొందించాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తున్నది. రాష్ట్రంలో అమలు చేసే ప్రతి ప్రభుత్వ పథకానికి మక్కల్ ఐడీ కార్డును కచ్చితం చేయనున్నది.