ముంబై, జనవరి 5: ఐఐటీ బాంబే విద్యార్థులు క్యాంపస్ నియామకాల్లో సత్తా చాటారు. ఏకంగా 85 మంది కోటి రూపాయలకు పైగా ప్యాకేజీతో ఉద్యోగాలు పొంది వావ్ అనిపించారు. ఈ మేరకు ఐఐటీ బాంబే గురువారం రాత్రి మొదటి విడత నియామకాల వివరాలను వెల్లడించింది.
ఈ సారి 63 మంది విద్యార్థులు అంతర్జాతీయ ఆఫర్లను పొందారు. నియామకాలు జరిపిన వాటి లో జపాన్, తైవాన్, సౌత్ కొరియా, నెదర్లాండ్స్, సింగపూర్, హాంకాంగ్ దేశాల కంపెనీలు ఉన్నాయి. అయితే మొత్తం మీద చూస్తే మొదటి విడతలో గత ఏడాదికన్నా తక్కువ ఆఫర్లే వచ్చాయి.