Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Raihan Vadra: ఢిల్లీలోని బికనేర్ హౌజ్‌లో జరుగుతున్న ఫోటో ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడు రైహన్ వద్రాకు చెందిన 75 ఫోటోలను తొలగించారు. ఆ ఘటన పట్ల బికనీర్ హౌజ్ స్పందించింది. తమ ఎగ్జిబిషన్లో కేవలం వన్యప్రాణులు, సంస్కృతిపై ఫోకస్ చేసినట్లు చెప్పింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని బికనేర్ హౌజ్‌లో జరుగుతున్న ఫోటో ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడు రైహన్ వద్రా(Raihan Vadra)కు చెందిన 75 ఫోటోలను తొలగించారు. ఆ ఘటన పట్ల బికనీర్ హౌజ్ స్పందించింది. తమ ఎగ్జిబిషన్లో కేవలం వన్యప్రాణులు, సంస్కృతిపై ఫోకస్ చేసినట్లు చెప్పింది. రైహన్ వద్రా తీసిన ఫోటోలు ఏ కేటగిరీలోకి రావని అధికారులు చెప్పారు. ఫోటోల్లో రాజకీయ సందేశాలు ఉన్న కారణంగా.. వాటిని తొలగించాలని ఆదేశించామన్నారు.
నో ఐడియా ఈజ్ ఫైనల్ అన్న టైటిల్‌తో రైహన్ వద్రా ఎగ్జిబిషన్లో తన ఫోటోలను ప్రదర్శించారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనకు చెందిన ఫోటోలు ఆ డాక్యుమెంట్లో ఉన్నాయి. ఎగ్జిబిషన్లో భాగంగా 105 ఫోటోలను రైహన్ ప్రదర్శించాడు. దాంట్లో 75 ఫోటోలను తొలగించారు. కొన్ని ఫోటోలను తొలగించేందుకు రైహన్ నిరాకరించారు. కానీ బికనీర్ హౌజ్ సిబ్బంది ఆ ఫోటోలను తొలగించారు.
బికనీర్ హౌజ్ వైఖరిని ప్రియాంకా గాంధీ ఖండించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

