Madhya Pradesh | మధ్యప్రదేశ్ టైగర్ రిజర్వ్‌లో మరో పులి మృతి..
మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) టైగర్ రిజర్వ్‌లలో పులల మరణాలు కొనసాగుతున్నాయి. గత కొన్నిరోజులుగా కూనో నేషనల్ పార్క్‌లోని చీతాలు మరణిస్తూ వస్తున్నాయి. తాజాగా బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో (Bandhavgarh Tiger Reserve) ఏడు నెలల వయస్సున్న ఆడ పులి పిల్ల (Tiger cub) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) టైగర్ రిజర్వ్‌లలో పులల మరణాలు కొనసాగుతున్నాయి. గత కొన్నిరోజులుగా కూనో నేషనల్ పార్క్‌లోని చీతాలు మరణిస్తూ వస్తున్నాయి. తాజాగా బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో (Bandhavgarh Tiger Reserve) ఏడు నెలల వయస్సున్న ఆడ పులి పిల్ల (Tiger cub) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే మరో పులితో జరిగిన పోరాటంలో అది మరణించి ఉంటుందని అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ACF) ఎఫ్ఎస్ నినామా (FS Ninama) అనుమానం వ్యక్తం చేశారు. పులి పిల్ల కళేబరం దగ్గర మరో పులి పాదముద్రలు (Pugmarks) కనిపించాయని తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని, డాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దింపినట్లు చెప్పారు. అయితే కూనో నేషనల్ పార్క్‌లో ఉన్న దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాల్లో ఇప్పటివరకు తొమ్మిది మరణించిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో పులలకు నిలయంగా మధ్యప్రదేశ్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నది. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) గత నెలలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలోనే మధ్యప్రదేశ్‌లో 785 పులులు ఉన్నట్లు తేలింది. కర్ణాటకలో 563, ఉత్తారఖండ్‌లో 560, మహారాష్ట్రలో 444 పులుల చొప్పున ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లో కన్హా టైగర్ రిజర్వ్, బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్, పన్నా టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, సాత్పురా టైగర్ రిజర్వ్, సంజయ్-దుబ్రి టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో 135పులులు ఉండగా, ఖానా రిజర్వ్ ఫారెస్టులో 105, పెంచ్‌లో 77 చొప్పున ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

