Bridge Lacks Access Road | మూడేళ్ల కిందట వంతెన నిర్మాణం.. అప్రోచ్ రోడ్లు లేక నిరుపయోగం
Bridge Lacks Access Road | ఒక నదిపై వంతెనను మూడేళ్ల కిందట నిర్మించారు. అయితే అప్రోచ్ రోడ్లు లేకపోవడంతో అది నిరూపయోగంగా ఉన్నది. దీంతో ఆ బ్రిడ్జిని వినియోగించుకోలేక పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
భోపాల్: ఒక నదిపై వంతెనను మూడేళ్ల కిందట నిర్మించారు. అయితే అప్రోచ్ రోడ్లు లేకపోవడంతో అది నిరూపయోగంగా ఉన్నది. దీంతో ఆ బ్రిడ్జిని వినియోగించుకోలేక పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. (Bridge Lacks Access Road) మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నర్మదాపురం, నరసింగ్‌పూర్ జిల్లాల సరిహద్దులోని ఉమర్ధా గ్రామం సమీపంలో దుధి నదిపై రూ.8.86 కోట్ల వ్యయంతో వంతెన నిర్మించారు. అయితే బ్రిడ్జికి ఇరువైపులా అనుసంధాన రహదారులు నిర్మించలేదు. దీంతో గత మూడేళ్లుగా ఈ వంతెన నిరూపయోగంగా ఉన్నది. రెండు జిల్లాలకు చెందిన 50 గ్రామాల ప్రజలు రవాణా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ క్షేత్రాల మీదుగా గుంతలమయంగా ఉన్న మార్గంలో వారు ప్రయాణించాల్సి వస్తున్నది.
కాగా, ఈ సమస్యను అధికారుల దృష్టికి పదేపదే తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని పరిసర గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రూ.9 కోట్ల వ్యయంతో చేపట్టిన వంతెన నిర్మాణం మూడేళ్ల కిందటే పూర్తైనప్పటికీ, ఇరువైపులా అనుసంధాన రహదారులను ఇప్పటికీ పూర్తి చేయకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అప్రోచ్ రోడ్డులు నిర్మించి రెండు జిల్లాల మధ్య ప్రయాణం, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Access Road
- bridge
- completion
- Lacks
RELATED ARTICLES
తాజా వార్తలు
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
Balmuri Vidyasagar Rao | రాజకీయ ఒత్తిళ్ల ద్వారా నా భూమి కబ్జాకు ప్రయత్నం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పెద్దనాన్న
Dimagi Naxals: దిమాగీ నక్సల్స్ అంటే తెలియదు.. సమాచారం లేదు: కేంద్రం హోంశాఖ
Bridge Lacks Access Road | మూడేళ్ల కిందట వంతెన నిర్మాణం.. అప్రోచ్ రోడ్లు లేక నిరుపయోగం
‘కార్మికుల హాజరు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ’
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

