లక్నో, జూన్ 5: పామును చూస్తే పెద్దవాళ్లకు కూడా భయంతో చమటలు పడతాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడతారు. కానీ, ఓ మూడేండ్ల చిన్నారి మాత్రం పామును చాక్లెట్లు నమిలినట్టు నమిలేశాడు. ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో జరిగింది. అక్షయ్(3) అనే బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా పక్కనే ఉన్న పొదల్లో నుంచి ఓ చిన్న పాము అతడి వద్దకు వచ్చింది. దానిని బాలుడు చేతితో తీసుకొని నమిలేశాడు. అది కాస్తా గొంతులో ఇరుక్కోవడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఈ విషయాన్ని గుర్తించిన బాలుడి నానమ్మ బిత్తరపోయింది. తేరుకొని బాలుడి నోట్లో నుంచి పామును బయటకు లాగి పడేసింది. చిన్నారిని దవాఖానకు తీసుకెళ్లగా ఎలాంటి అపాయం లేదని వైద్యులు వెల్లడించారు.