Supreme Court: నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల డెడ్‌లైన్: సుప్రీంకోర్టు
Supreme Court: అరెస్టు కాదు, నిర్బంధించిన క్షణం నుంచి 24 గంటల డెడ్‌లైన్ మొదలవుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. ఓ వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేందుకు నిర్దేశిత గడువు దాటితే, అతన్ని రిలీజ్ చేయాల్సి వస్తుందని కోర్టు పేర్కొన్నది.
న్యూఢిల్లీ: నిర్బంధం, అరెస్టు మధ్య తేడాను సుప్రీంకోర్టు(Supreme Court) వెల్లడించింది. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాల్సిన అంశంపై అత్యున్నత న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం నిందితులను 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలని, ఆర్టికల్ 22(2) ప్రకారం ఆ నిబంధన వర్తిస్తుందని, కానీ ఆ వ్యక్తిని అరెస్టు చేసిన క్షణం నుంచి కాకుండా, ఆ వ్యక్తిని నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల డెడ్‌లైన్ మొదలవుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది.
2025లో ఓ డ్రగ్ స్మగ్లర్‌ను అరెస్టు చేసిన కేసులో దాఖలైన పిటీషన్ అంశంలో సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఉజ్వల్ భూయాన్, అతుల్ ఎస్ చందూర్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో తీర్పు ఇచ్చింది. ఒకవేళ ఆ వ్యక్తిని నిర్బంధించిన 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకపోతే, అప్పుడు ఆ వ్యక్తిని తక్షణమే రిలీజ్ చేయాల్సి ఉంటుందని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. అరెస్ట్, డిటెన్షన్ మధ్య తేడా చూపిస్తూ రాజ్యాంగ హక్కుల్ని కాలరాయలేరని కోర్టు తెలిపింది.
కోర్టు ఆదేశాలు..
నిర్బంధంలోకి తీసుకున్న క్షణం నుంచి 24 గంటల డెడ్‌లైన్ ప్రారంభం అవుతుంది. అరెస్టు చేసిన క్షణం నుంచి కాదు. 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకపోతే ఆ వ్యక్తిని రిలీజ్ చేయాలి. అయితే మెజిస్ట్రేట్‌కు చేరుకునే ప్రయాణ సమయాన్ని మాత్రం మినహాయించాలి. ఆర్టికల్ 22(2) కింద బఫర్ పీరియడ్‌ను క్రియేట్ చేయరాదు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 58 కింద డిటెన్షన్ జరగాలి. డిటెన్షన్ జరిగిన తేదీ, సమయాన్ని మెజిస్ట్రేట్ నమోదు చేయాలి. ఒకవేళ నిర్బంధ సమయం దాటితే, అప్పుడు రిమాండ్‌కు మెజిస్ట్రేట్ నిరాకరించవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court: నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల డెడ్‌లైన్: సుప్రీంకోర్టు
Regina Cassandra | దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుల విమర్శలు సరికాదు: రెజీనా కసాండ్రా!
రేపటి నుండి అర్వపల్లి దర్గా ఉత్సవాలు
DMHO Narendra Rathod | వైద్యసేవలో ఆటంకాలు లేకుండా సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
Stock Market | ట్రంప్ ఓటమితో స్టాక్‌మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 2,100 పాయింట్లు జంప్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

