WATCH: గర్బా డ్యాన్స్ చేస్తూ… కుప్పకూలి మరణించిన యువకుడు
గర్బా డ్యాన్ను మొబైల్లో రికార్డు చేసిన ఒకరు ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా షాకయ్యారు.
అహ్మదాబాద్: శరన్నవ రాత్రుల సందర్భంగా ఒక యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తారాపూర్లోని ఆతీ శివశక్తి సొసైటీలో ఆదివారం సాయంత్రం గర్బా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ, యువకులు చుట్టూ తిరుగుతూ పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేయసాగారు. 21 ఏళ్ల వీరేంద్ర సింగ్ రమేష్ భాయ్ రాజ్పుత్ కూడా ఇందులో పాల్గొన్నాడు. అందరితో కలిసి గర్బా డ్యాన్స్ చేశాడు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ముందుకు వచ్చి కుప్పకూలిపోయాడు. షాకైన తొటివారు ఎంత ప్రయత్నించినా అతడు కదలలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ యువకుడు గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, గర్బా డ్యాన్ను మొబైల్లో రికార్డు చేసిన ఒకరు ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా షాకయ్యారు. మరోవైపు ఇటీవల కాలంలో డ్యాన్స్ లేదా వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
Anand :
गरबा खेलते खेलते एक शख्स की मौत।
तारापुर में आती शिवशक्ति सोसायटी में गरबा आयोजित किया गया था।
युवक को अस्पताल ले जाया गया लेकिन तब तक देरी हो चुकी थी।
वजह दिल का दौरा पड़ने से मौत बताई जा रही है। pic.twitter.com/GlUA1irveA
— Janak Dave (@dave_janak) October 2, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

